కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈనెల 14వ తారీఖున వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరికపై తన అభిమానులకు తాజాగా ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ ( Gajendra singh Shekawat )తో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) సమావేశం కానున్నారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై తీవ్ర కసరత్తులు చేసే అవకాశం ఉంది.
నేడు పులివెందుల, ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Y.S. Jagan Mohan Reddy ) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు.
భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో నేటి మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడిలో 2 కోట్ల 46 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గొంతెరు డ్రైన్ పై బ్రిడ్జ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ( Grandhi Srinivas ) ప్రారంభించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మగాడివైతే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చెయ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటిఆర్ మాట్లాడ్డం ఆయన రాజకీయ అవివేకానికి నిదర్శనం అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం ఎన్నో బటన్లు నొక్కాడని.. 2024లో మీరు తమ కోసం రెండు బటన్లు నొక్కాలన్నారు. తొలి బటన్ ఎమ్మెల్యేకు, రెండవది ఎంపీ నొక్కి వైసీపీకి అండగా నిలవాలని మంత్రి రోజా కోరింది.
నాకు ఇవే చివరి ఎన్నికలు అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వెల్లడించారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. నా కూతుళ్ళకు రాజకీయాలలో ఆసక్తి లేదు.. రాజకీయాలలో ఆసక్తి ఉంటే నా తమ్ముడి కొడుకు వస్తాడేమో అని తెలిపారు.
అభివృద్ధి లేకుంటే తలసరి ఆదాయం పెరగదు అని ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) అన్నారు. తలసరి ఆదాయం, రాష్ట్ర స్తూల ఉత్పత్తి లో ఏపీ ముందుంది.. రామాయపట్నం పోర్టును సీఎం జగన్ ( cm jagan ) చేతుల మీదుగా శంఖుస్థాపన చేసి ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు.