ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ.. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారి పోతున్నాయి. నంద్యాల జిల్లా టీడీపీలోనే అపర చాఱక్యుడిగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి తనదైన వ్యూహాలతో అధికార వైసీపీ నేతలను టీడీపీలోకి చేర్చుకుంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. బీసీజేఆర్ దెబ్బకు ఫ్యాన్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుందా.. ఈసారి బనగానపల్లె గడ్డపై బీసీ జనార్థన్ రెడ్డి తెలుగుదేశం జెండా ఎగరనుందా.. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఓటమి బాటలో పయనిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
Read Also: Chandni: హైపర్ ఆది కి ప్రపోజ్ చేసిన హీరోయిన్.. వీడియో వైరల్..
ఇక, ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి స్పీడ్ పెంచారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పి వరుసగా సైకిలెక్కుతున్నారు. గత 5, 6 నెలలుగా బాబు ష్యూరిటీ, భవిష్యత్తు కార్యక్రమంలో బాగంగా నియోజకవర్గంలోని బనగానపల్లె, కొలిమిగుండ్ల, అవుకు, సంజామల, కోవెలకుంట్ల మండలాల్లో అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన బీసీ జనార్థన్ రెడ్డి టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ భవిష్యత్తు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్న బీసీజేఆర్ అదే సమయంలో కీలక వైసీపీ నేతలను టీడీపీలోకి చేర్చుకుంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. తాజాగా బనగానపల్లెలోని తెలుగుదేశం కార్యాలయంలో అవుకు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన కైపా వెంకటరామి రెడ్డి, కైపా చంద్రశేఖర్ రెడ్డి, మంచాల వీర ప్రతాప్ రెడ్డి వంటి మొత్తం 115 మంది వైసీపీ నేతలు కుటుంబాలతో సహా తమ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.
Read Also: Rishabh Pant-IPL 2024: రిషబ్ పంత్‌కు లైన్‌క్లియర్.. ఐపీఎల్ 2024లో పునరాగమనం!
అయితే, అదే విధంగా బనగానపల్లె తెలుగుదేశం కార్యాలయంలో జరిగిన మరో చేరికల కార్యక్రమంలో సుంకేసుల గ్రామానికి చెందిన కంభం చౌడయ్య ఆధ్వర్యంలో 100 బీసీ కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నాయి. ఆ తర్వాత కోవెలకుంట్ల పట్టణానికి చెందిన షేక్ రఫీ, ఇమామ్ ఉస్సేన్, ఉస్సేన్ బాషా, జమాల్ బాషా, వెంకట సుబ్బా రాయుడు, రామాంజనేయులుతో వవటి వైసీపీ నేతలతో సహా మొత్తం 25 కుటుంబాలు, కోవెలకుంట్ల సంత పేట కాలనీకి చెందిన వైసీపీ నేతలు గాడేకారి మహబూబ్ బాషా, గాడేకారి, హుస్సేన్ బాషా, ఇదురుష్ బాషా, ప్రేమ్ రాజ్, షేక్ రుక్సానా, షేక్ హుస్సేన్ బి, మౌలాలమ్మవంటి 30 మంది నేతలు కుటుంబాలతో సహా వైసీపీని వీడి బీసీ జనార్థన్ రెడ్డి సైకిలెక్కేస్కారు. అదే కోవెలకుంట్ల పట్టణంలో కుమ్మరి వీధికి చెందిన వైసీపీ నేతలు మాజీ కోఆప్షన్ మెంబెర్ పెయింటర్ ఖాసీం, బాలకృష్ణ అసోసియేషన్ ప్రెసిడెంట్, షేక్ డ్రైవర్ జిలాన్, పాఠన్, ఆన్సర్, ఫకృద్దీన్, అబ్బాస్, అక్బర్ వంటి నేతలతో సహా మొత్తం 30 కుటుంబాలు, సౌదరదిన్నె గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు జలాలీష్, వైసీపీ సర్పంచ్ అభ్యర్థి జలాలీ బాష, సీనియర్ నాయకులు జలాలీ నడిపి హుసేన్, పసుపుల దస్తగిరి, అల్లూరి దస్తగిరి, జలాలీ దస్తగిరి, జలాలీ షరీఫ్, అవుకు బాబా ఫక్రుద్దీన్ తదితర వైసీపీ నేతలు కూడా బీసీ జానార్థన్ రెడ్డి ఆధ్వర్యంలోని టీడీపీలో చేరడంతో కోవెలకుంట్లలో ఫ్యాన్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిందనే చెప్పాలి.
Read Also: Ram Charan: వైజాగ్ లో సందడి చేస్తున్న అల్లు అర్జున్, రామ్ చరణ్ .. ఫ్యాన్స్ కు పండగే ..
అలాగే, టీడీపీలో చేరిన వైసీపీ నేతలు మాట్లాడుతూ.. బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధి ఒక్క బీసీ జనార్దన్ రెడ్డితోనే సాధ్యమని వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నామని తెలిపారు. అనంతరం టీడీపీలో చేరిన నేతలనుద్దేశిస్తూ బీసీ జనార్థన్ రెడ్డి ప్రసంగిస్తూ.. పార్టీలో చేరిన నాయకులందరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. ఈ 50 రోజులు అందరం సమిష్టిగా పని చేసి సైకో పాలనకు అంతం పలికి.. బనగానపల్లె గడ్డపై నుంచి సైకిల్ జైత్రయాత్ర మొదలు పెట్టాలని బీసీ జనార్థన్ రెడ్డి పిలుపునిచ్చారు. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో రానున్న నేపథ్యంలో వరుసగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు షురూ అవడంతో తెలుగుదేశం క్యాడర్‌లో కదనోత్సవం నెలకొనగా, ఎన్నికల ముందు కీలక వైసీపీ నేతలు, కార్యకర్తలు వందలాదిగా సైకిలెక్కేస్తుండడంతో బనగానపల్లె నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ దాదాపుగా ఖాళీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 5 ఏళ్ల పాలనలో అభివృద్ధిలో విఫలం కావడమే కాకుండా, పలు అవినీతి ఆరోపణల్లో కూరుకుకుపోయాడన్న విమర్శలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఓటమి బాటలో పయనిస్తున్నాడని.. ఈసారి బనగానపల్లె గడ్డపై టీడీపీ అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నంద్యాల జిల్లాలో సైకిల్ జైత్రయాత్ర బనగానపల్లె నుంచే స్టార్ట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.