రాబోయే ఎన్నికల్లో జనేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా కాదు.. నా మీద కాకినాడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎక్కడ పోటీ చేయాలనేది పవన్ కళ్యాణ్ ఇష్టం ఉండదు.. పై నుంచి ఆదేశాలు రావాలి.. అప్పుడే ఆయన పోటీ చేసేది అని పేర్కొన్నారు. ఇక, కాకినాడలో పవన్ కళ్యాణ్ పార్టీకి గుండు సున్నా తప్పదన్నారు. గాజు గ్లాస్ అయిన నా మీద పోటీ పెట్టాలని గతంలోనే చెప్పాను అని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరటం దారుణం అని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Naga Shaurya : ఆ దర్శకుడితో మరో మూవీ చేయబోతున్న నాగశౌర్య..?
ఇక, ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశామని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రధానంగా సుమారు 30 వేల మంది ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. వీరందరికీ 2026 డిసెంబర్ నాటికల్లా గృహ నిర్మాణాలు కూడా పూర్తి చేసి సొంతింటి కల సహకారం చేస్తామని చెప్పుకొచ్చారు. మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు .