ఏప్రిల్ 2వ తేదీన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్- ఉధమ్ సింగ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం రుద్రాపూర్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటనను రిలీజ్ చేసింది. లోక్‌సభ ఎన్నికలు 2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది.
భారత దేశంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఔషద మందుల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(NPPA) ఔషధాల టోకు ధర సూచికలో వార్షిక సవరణలు చేసినట్లు సమాచారం.
వాయువ్య హిందూ మహా సముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ చేపల బోటుతో పాటు అందులో సిబ్బందిని కూడా రక్షించింది. కాగా, బోటులో ఉన్న వారు పాకిస్థాన్‌కు చెందిన 23 మంది సిబ్బంది అని భారత నేవీ అధికారులు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆవిష్కరించారు.
ఐటీ శాఖకు బీజేపీ సుమారు 4600 కోట్ల రూపాయల పెనాల్టీ కట్టాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపలు గుప్పించింది. ఆ డబ్బును వసూల్ చేసేందుకు బీజేపీకి ఆదాయపు పన్ను శాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ పేర్కొన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న ( గురువారం ) జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ సత్తా చాటాడు.
బీహార్‌లో మహా కూటమి మధ్య సీట్ల విభజన జరిగింది. ఇందులో ఆర్జేడీ 26, కాంగ్రెస్ 9, వామపక్ష పార్టీలు 5 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సీట్లపై ఒప్పందం కుదిరిందని ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ సహా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
భారత్‌తో వాణిజ్యం కోసం మార్గాలను అన్వేషిస్తున్నట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం నాడు మరోసారి దీనిపై చర్చించింది. గత కొద్ది రోజుల క్రితం, పాకిస్తాన్ కొత్త విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ లండన్‌లో ఒక ప్రకటన చేశారు.
భారతదేశంలో విద్య లేని వారు 3.4% ఉంటే ఉన్నత విద్యావంతులైన యువకులు నిరుద్యోగులుగా ఉంటారు. గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత రేటు 29.1శాతంగా ఉంది. ఇక, భారతదేశంలో నిరుద్యోగం ప్రధానంగా యువతలో సమస్యగా మారింది.