జమ్మూ కాశ్మీర్లో జరిగే ఎన్నికలకు 27 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ (INC) ఇవాళ (శనివారం) విడుదల చేసింది. ఐదు దశల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ నేతలు జమ్మూ కాశ్మీర్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ్య క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. గుజరాత్లోని పోరుబందర్లో ఆయన స్థానికులతో కలిసి కాసేపు గ్రౌండ్ లో క్రికెట్ ఆడారు.
గంభీర్ విరాట్ తో కరచాలనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు కౌగిలించుకోవడం కనిపించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కేరళ బీజేపీ అధ్యక్షుడు, వయనాడ్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న కే సురేంద్రన్పై ఏకంగా 242 క్రిమినల్ కేసులు నమోదైనట్టు తెలిపారు.
డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇవాళ (శనివారం) ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్న ఓ ఛాయ్ దుకాణంలోకి వెళ్లి.. అక్కడ ఛాయ్ పెట్టించుకుని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాగారు.
వేసవి ఎండలు రోజు రోజుకూ మండిపోతుండటంతో ఆ తాపాన్ని తగ్గించుకునేందుకు జనం పలు రకాల పానీయాలను తాగుతుంటారు. దీంతో మార్కెట్లో నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి.