సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో నిర్మించిన భారత దేశపు మొట్ట మొదటి ఐస్ కేఫ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్ లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన లడక్ లో ఈ ఐస్ కేఫ్‌ను రెడీ చేశారు.
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం ఆయన తమ్ముడు కాకర్ల సునీల్ ఆయన సతీమణి కాకర్ల సురేఖ వింజమూరులోని బీసీ కాలనీలో శనివారం నాడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల సమయంలో కనిపించే హడావుడి మణిపుర్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక, ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగులు మాత్రమే కనిపిస్తున్నాయి.
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలు కలిసి సంయుక్తంగా నౌవి, వైమానిక విన్యాసాలను ఇవాళ (ఆదివారం) నిర్వహించేందుకు రెడీ అయ్యాయి.
దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు ఎట్టకేలకు దొరికేసింది. గత నెల 19వ తేదీన ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో కనిపించింది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేడు సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆప్ ప్రకటించింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేసి తగిన ప్రాధాన్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం అని కనుక బీసీలు అందరు ఐక్యంగా కృషి చేసి తెలుగుదేశానికి అండగా నిలవాలని ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోఫై అస్సాం ముఖ్యంత్రి హిమంత బిశ్వ శర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గమనిస్తే.. భారత్‌లోని ఎన్నికల కంటే పాకిస్థాన్‌లో ఎన్నికలకు తగినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
పెమ్మసాని మాట్లాడుతూ.. అయితే, వ్యాపారస్తులు లేదా సహజ వనరులే లక్ష్యంగా కొందరు రాజకీయ నాయకులు దండుకుంటున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
ఉక్రెయిన్‌లోని రెండో అతి పెద్ద నగరం ఖార్కీవ్ పైకి రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. శుక్రవారం నాడు అర్థ రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 8 మంది మరణించగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.