భారత దేశం ఉగ్రవాదాన్ని సహించబోదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అవసరమైతే పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని హత మారుస్తామని హెచ్చరించారు.
ఐపీఎల్ 2024 మ్యాచ్ లు తీవ్ర ఉత్కంఠ రేపుతూ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే, ఇవాళ (ఏప్రిల్ 6న) రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడియంలో పోటీ పడబోతున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (శనివారం) రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనుంది. బీజేపీకి ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఆయన సహరాన్‌పూర్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే, సాయంత్రం ఘజియాబాద్‌లో రోడ్ షో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
నేడు సాయంత్రం తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. జన జాతర పేరుతో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రిలీజ్ చేయనున్నారు.
అదే విధంగా వరి ఎక్కువ పండించే రాష్ట్రం ఏదంటే అక్కడ కూడా తెలంగాణనే ముందుంది.. ఈ ఘనత కేసీఆర్ దే అని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టినందుకు గ్రామాల్లో ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు.
నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన సీతారాంపురం పరిధిలోని చిన్నగంపల్లి నుంచి ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది 5 గ్యారంటీలు కాదు ఐదు మోసాలు, ఐదు అబద్ధాలు అని విమర్శలు గుప్పించారు.
గతంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యం ఏలింది అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గతంలో చేసిన తప్పులను రిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది తెలిపారు. వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ లలో నీళ్లు లేవు.. నాగార్జున సాగర్ లో గేట్లు ఎత్తిన నీళ్ళు రాని పరిస్థితి నెలకొంది.. ఈనాడు మంచి నీళ్లను ప్రక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పాడింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తెలిపిన వివరాలు.. గతంలో మాదిరే నేతన్నలకు అర్డర్లు వేంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.