బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సరస్వతీ శిశు మందిర్ జిల్లా అధ్యక్షులు వనమా పూర్ణచంద్రరావు నివాసానికి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం నాడు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మొదలు నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు రాజకీయ విశేషాలను పెమ్మసానికి వనమా వివరించారు. ఆనాటి ఉద్యమ కాలంలో పోరాటం చేసినందుకుగాను 12 రోజులు తీహారు జైల్లో ఉంచిన విషయాన్ని ఈ సందర్భంగా వనమా తెలిపారు. బీజేపీ కూడా ఎన్నో ప్రజా రంజక పథకాలను మోడీ నాయకత్వంలో అమలు అవుతున్నాయని ఈ సందర్భంగా పెమ్మసాని చెప్పుకొచ్చారు.
Read Also: Ashok Galla: డిజిటల్ క్రియేటర్‌కు యువ హీరో అశోక్ గల్లా ఆర్థిక సహాయం!
ఇక, చాలామంది నాయకులు రాజకీయాల్లో పెట్టిన ఖర్చును ఎన్నికల తర్వాత వ్యాపారస్తులపై మోపుతుంటారు.. మాకు అలాంటి అవసరం లేదు.. చిన్నచిన్న వ్యాపారులు పడే ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శనివారం నాడు జరిగిన ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. అయితే, వ్యాపారస్తులు లేదా సహజ వనరులే లక్ష్యంగా కొందరు రాజకీయ నాయకులు దండుకుంటున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
Read Also: Adah Sharma: నేను చూడ్డానికే వెళ్లాను.. అందరికీ తప్పకుండా చెబుతా: ఆదా శర్మ
అయితే, గుంటూరులోని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ అంతర్గత సమావేశం శనివారం నాడు జరిగింది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని డివిజన్ల నాయకులతో డాక్టర్ పెమ్మసాని మాట్లాడారు. కాగా స్థానిక, సంస్థాగత సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. క్లస్టర్ బూతు డివిజన్ స్థాయి నాయకులు కష్టించి పని చేయాలని ఎన్నికల్లో టీడీపీ విజయం చారిత్రాత్మకం కాబోతుందని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అయితే డివిజన్లో ఉన్న చిన్నపాటి సమస్యలను పెమ్మసాని దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పరిష్కరించారు. దీంతో డివిజన్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
Read Also: Jos Buttler Century: ఐపీఎల్‌లో వందో మ్యాచ్.. సిక్సర్‌తో సెంచరీ చేసిన జోస్ బట్లర్! ఎవరూ ఊహించలేదు
అలాగే, భూసేకరణ చేసి శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తాం.. మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో నారా లోకేష్, డా. పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 2019లో జగన్ ను చూసి వైయస్సార్ కొడుకు, ఓదార్పు యాత్ర చేస్తున్నాడు అని నమ్మి ప్రజలు 151 సీట్లతో గెలిపించారు. గెలిచిన తర్వాత 30 ఏళ్ల ప్రజాభిమానం సంపాదించాల్సిన జగన్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం తన జీవితాన్ని ధార పోసిన చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయించారు.. ఇవాళ మంగళగిరిలో అరాచక రాజ్యమేలుతుంది. అయోధ్యరామిరెడ్డిని, ఆర్కేను ఒకటే అడుగుతున్నాను.. ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో ఒక తట్ట మట్టి అయినా ఎత్తారా? కనీసం ఒక రోడ్డుకు ప్యాచ్ వర్క్ అయినా పూర్తి చేశారా? అని పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు.