నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం ఆయన తమ్ముడు కాకర్ల సునీల్ ఆయన సతీమణి కాకర్ల సురేఖ వింజమూరులోని బీసీ కాలనీలో శనివారం నాడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ కాలనీ వాసులు బ్రహ్మరథం పట్టారు. ఇంటింటికి తిరిగి తెలుగు దేశాన్ని గెలిపించాలని వారు అభ్యర్థించారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని అధికారం ఉంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు వీలుంటుందని అందుకోసం మా అన్న కాకర్ల సురేష్ ను గెలిపించాలని కోరారు.
Read Also: Manjummel Boys Telugu: తెలుగులో రికార్డు నెలకొల్పిన మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’!
ఇక, ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ దంతులూరి వెంకటేశ్వరరావు, మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసుల యాదవ్, సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి, సీనియర్ నాయకులు మంచాల శ్రీనివాసులు నాయుడు, గణప సుదర్శన్ రెడ్డి, పెరుమాళ్ళ ఆరి కొండ శ్రీనివాసులు, కే శ్రీనివాసులు నాయుడు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు.