ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేసి తగిన ప్రాధాన్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం అని కనుక బీసీలు అందరు ఐక్యంగా కృషి చేసి తెలుగుదేశానికి అండగా నిలవాలని ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన సీతారాంపురం పట్టణంలో శనివారం నాడు బీసీ జయహో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ పై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం.. అలాగే, పెళ్లి కానుక లక్ష రూపాయలకు పెంపు.. చంద్రన్న బీమా 10 రూపాయలకే పునరుద్ధరణ చట్టబద్ధంగా కుల గణన విద్యా పథకాలు పునరుద్ధరణ చేస్తామని కాకర్ల సురేష్ తెలిపారు.
Read Also: Adilabad Rains: ఆదిలాబాద్ లో చిరు జల్లులు.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు
ఇక, శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు సంవత్సరంలో పూర్తి చేస్తామని ఉదయగిరి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ చెప్పారు. ఒక లక్ష యాభై వేల కోట్లతో సబ్ ప్లాన్ అమలు, 10, 000 కోట్లతో కార్పొరేషన్ ద్వారా రుణాలు, బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు తదితర అంశాలను బీసీల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని డిక్లరేషన్ ను విడుదల చేశారు అని ఆయన తెలిపారు. బీసీ సోదరులందరూ ఐక్యంగా కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా సురేష్ ను గెలిపించుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ అభ్యర్థించారు.
Read Also: Himanta Biswa Sarma: పాకిస్థాన్లో అయితే.. మీ మేనిఫెస్టో కరెక్ట్‌గా సరిపోతుంది..
అయితే, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చంచల బాబు యాదవ్ మాట్లాడుతూ.. బీసీ సంక్షేమానికి చేపట్టే కార్యక్రమాలపై తెలుగుదేశం- జనసేన- బీజేపీ పార్టీలో కృషి చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగేలా చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన తెలుగుదేశం పార్టీకి బీసీలందరూ ఐక్యంగా కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ ని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, బీసీ జిల్లా అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్ర మాట్లాడుతూ.. బలహీన వర్గాల వారిని అండగా నిలిచి వారి ఎదుగుదలకు తోడ్పడిన తెలుగుదేశం పార్టీ అన్నారు.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం అన్ని వర్గాల అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. బీసీలు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: Show Cause Notice: ఎన్నికల శిక్షణకు డుమ్మా కొట్టిన ఉద్యోగులు.. షోకాజ్ నోటీసులు
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీకుర్తి రవీంద్రబాబు, తెలుగుదేశం ఉదయగిరి బీజేపీ ఇన్చార్జ్ కదిరి రంగారావు, జనసేన కోఆర్డినేటర్ భోగినేని కాశీ రావు, సీతారాంపురం మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు, ఉదయగిరి మండల కన్వీనర్ బయన్న, జిల్లా తెలుగు యువత కార్యదర్శి నాగేష్, బీసీ నాయకుల రాజా, జనసేన అధ్యక్షులు పోలిశెట్టి శ్రీనివాసులు, బీజేపీ అధ్యక్షులు సింగల రమణయ్య, మేకపాటి మాలాద్రి, సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు వెంకటసుబ్బమ్మ, మాజీ జడ్పిటిసి సభ్యురాలు కలివేల జ్యోతి, బండి రవికుమార్, జనసేన జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర, తెలుగు యువత అధ్యక్షులు చింతల శ్రీనివాసులు సురేందర్ రెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు ఎస్ రాజశేఖర్ రెడ్డి, క్రిస్టియన్స్ అధ్యక్షులు ఓబులాపురం ప్రసన్నకుమార్, అబ్రహం, నేలటూరు జాషువా, కలివేల భాగస్వామి, పిడుగు రమేష్, జమ్మలమడుగు ఇజ్రాయిల్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.