కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోఫై అస్సాం ముఖ్యంత్రి హిమంత బిశ్వ శర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గమనిస్తే.. భారత్‌లోని ఎన్నికల కంటే పాకిస్థాన్‌లో ఎన్నికలకు తగినట్లు ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో విభజన వాదాన్ని సృష్టించి అధికారంలోకి రావాని కాంగ్రెస్ చూస్తుందని ఆరోపించారు. శనివారం నాడు జోరాట్ స్థానంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు.. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో బుజ్జగింపు రాజకీలకు నిదర్శనం అని పేర్కొన్నారు. సమాజంలో విభజన చిచ్టుపెట్టి అధకారంలోకి రావాలని కాంగ్రెస్ అనుకుంటుంది.. అస్సాంలో ఉన్న మొత్తం 14 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. భారత దేశాన్ని విశ్వగురువుగా మర్చేందుకు కమలం పార్టీ ఉద్యమాన్ని చేపట్టిందని సీఎం హిమంత శర్మ అన్నారు.
Read Also: Premalu OTT: ప్రేమలు ఓటీటీ రిలీజ్‌లో ట్విస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇక, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. పార్టీలు మారే హిమంత బిశ్వ శర్మకు కాంగ్రెస్ పార్టీ లౌకిక, సమ్మిలిత తత్వం అస్సలు అర్థం కాదని తెలిపింది. ఇక, హిమంత 2015లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు.. ‘హిమంత ఏళ్ల తరబడి కాంగ్రెస్ ఉన్నప్పటికి.. పార్టీ విలువలు అర్థం చేసుకోలేదు.. అందుకే బీజేపీలో చేరి.. కేవలం తన నిజాయితీని చాటుకోవటం కోసమే కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని అస్సాం కాంగ్రెస్ అధికార ప్రతినిధి బేదబ్రతా బోరా ఎద్దేవా చేశారు. అయితే, అస్సాంలో మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.