టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలో యార్లగడ్డ శుక్రవారం నాడు సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని రైలు కట్ట ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ.. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలతో పాటు గన్నవరం అభివృద్ధి కోసం యార్లగడ్డ రూపొందించిన ప్రత్యేక ప్రణాళిక కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో చేకూరే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.
Read Also: Ram Charan : భార్య, కూతురుతో చెన్నై కి రామ్ చరణ్.. న్యూ లుక్ అదిరిందిగా..
ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు గ్రామస్థులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుదేలైందన్నారు. దీంతో ఉపాధి అవకాశాలు లేక అనేక మంది యువత వలస బాట పట్టారని అవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పాలన అందాలన్నా.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గన్నవరంలో తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నియోజకవర్గంలో సాగు, తాగు నీటి కష్టాలు తీర్చుతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి 250 పరిశ్రమలు తెచ్చి 20 వేల ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన 15 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తానని చెప్పారు. అదేవిధంగా ప్రసాదంపాడు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజలందరూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలిపి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు.
Read Also: Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం.. పశ్చిమాసియాకు సర్వీస్‌లు నిలిపివేత!
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పొలిశెట్టి రమణ, మాజీ సర్పంచి బొప్పన హరికృష్ణ, సర్పంచి గంగారత్నం బాలాజీ, ఉప సర్పంచ్ గూడవల్లి నర్సయ్య, ఎంపీటీసీ సభ్యులు గుజ్జర్లపూడి అజిత, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు పరుచూరి నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జర్లపూడి బాబురావు, సర్నాల బాలాజీ, బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి డా. ఫణి, జనసేన మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు మహేష్, వీర మహిళలు సిరి, సుభాషిణి, తెలుగు యువత నాయకులు ఉల్లాస శివ, గుజ్జర్లపూడి రవీంద్ర బాబు, వాసు, టీడీపీ మహిళా నాయకులు సుభాషిణి, శ్వేత, మండల పార్టీ ఉపాధ్యక్షులు దాసరి మహేష్, మండల మైనారిటీ అధ్యక్షులు షరీఫ్, సీనియర్ నాయకులు లంకలపల్లి యోగేశ్వరరావు, విజ్జి రామారావు, అంగిరేకుల వాసు, ఎన్. నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.