టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్ గతంలో ఏం చేశాం.. గెలిస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కే గ్యారెంటీ లేక పొత్తులు పెట్టుకున్నాడు అని మండిపడ్డారు. భవిష్యత్తు లేని చంద్రబాబు ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తారట.. తెలంగాణలో ఓటుకు నోట్లు స్కాంలో దొరికిపోయి.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను వదిలి రాత్రికి రాత్రే పారిపోయి ఆంధ్రకు వచ్చారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. లోకేష్ రెడ్ బుక్కు అంటూ వైసీపీ నాయకులను బ్లాక్ మెయిల్ చేసే పనిలో ఉన్నారు.. చిత్తూరు జిల్లాకు వస్తే ఆ బుక్కులో మొదటి పేరు పెద్దిరెడ్డి దే అంటారు అని మంత్రి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
Read Also: Lore and George: వరల్డ్ ఓల్డెస్ట్ అవిభక్త కవలలు ఇకలేరు..
నారా లోకేష్ బెదిరింపులకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భయపడే పరిస్థితి లేదు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. కాగా, ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటమి తథ్యమన్నారు. 14 ఏళ్ల పాటు సీఎంగా చంద్రబాబు పని చేసిన ఆయన పాలనలో చెప్పుకోవడానికి ఒక్క పథకం అయినా ఉందా అని ఆయన ప్రశ్నించారు. పేదలను సంక్షేమ పథకాలతో ఆదుకున్న ఘనత జగన్‌ది.. జన్మభూమి కమిటీలతో దోచుకున్న చరిత్ర చంద్రబాబుదని పెద్దిరెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు అమలు కాని హామీలతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారు.. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌కు మాత్రమే దక్కుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.