ప్రజాగళం 32వ సభ గుంటూరు జిల్లాలోని తాడికొండలో జరుగుతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ ఇది తాడికొండ కాదు రాష్ట్ర రాజధాని అమరావతి.. అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను.. ఈ రాజధానిని ఈ అమరావతిని ఒక వెంట్రుక కూడా ఎవరు కదిలించలేరు.. ఈరోజు ఏప్రిల్ 13.. మే 13న చరిత్ర తిరగబడుతుంది.. ప్రజలు రాసిన చరిత్ర మిగులుతుంది.. తెలుగువాడు గర్వపడేలా రాజధాని ఉండాలని సంకల్పంతో అమరావతిని నిర్మించేందుకు సిద్ధమయ్యాం అని ఆయన చెప్పుకొచ్చారు. 29 వేల మంది రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు.. అమరావతిని నిర్మించింది, ఆంధ్రప్రదేశ్ కు సాఫ్ట్వేర్ ను పరిచయం చేసింది నాకోసం కాదు.. ప్రజల కోసమే అని చంద్రబాబు అన్నారు.
Read Also: Tragedy: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అనంతలోకాలకు.. అన్న ఇద్దరు చెల్లెల్లు మృతి
గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినవాడు మన జిల్లాలోని చదువుకొని వెళ్ళాడు అని చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ, కన్న తల్లిని, జన్మభూమిని మర్చిపోకూడదన్న కారణంతో.. గుంటూరుకు వచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటున్నాడు చెప్పారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో తెలియని పరిస్థితికి జగన్ తీసుకువచ్చాడు.. చివరికి తిక్కలోడి మూడు ముక్కలాటగా రాజధాని మిగిలిపోయింది అని ఆరోపించారు. హైదరాబాద్ లో 5000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టాం.. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేశాం.. అది పరిపాలన చేయటమంటే.. ఒకప్పుడు శాతవాహనులు రాజధానిగా పరిపాలించిన ప్రాంతం ఇది.. దేవతల రాజధాని అమరావతి.. అందుకే ఈ ప్రాంతానికి అమరావతి అని పేరు పెట్టాం అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Sydney mall Attack: సిడ్నీ మాల్ కత్తిపోటు దాడిలో 6కి చేరిన మృతుల సంఖ్య.. అనుమానితుడి కాల్చివేత..
జగన్ లాంటి రాక్షసులు వెయ్యి మంది వచ్చినా.. అమరావతి వెంట్రుక కూడా పీకలేరంటూ చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి ముహూర్త బలం అది.. అమరావతి జేఏసీపై 3000 కేసులు పెట్టారు.. మనకు మద్దతుగా జనసేన- బీజేపీ పార్టీలు ఉన్నాయి.. పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగిన నాయకుడు.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రావడమే కాదు.. అమరావతే రాజధాని అని ఉత్సవాలు చేసుకునే రోజు కూడా.. అదే రోజున జగనాసుర వధ, అమరావతి రక్షణ కూడా జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి.. జగన్ ను భరించే శక్తి ప్రజలకు లేదు.. 10 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల కోసం నిర్మించిన ప్రజా వేదికను ఇంగితం ఉన్న వ్యక్తి ఎవరైనా కూల్చేస్తారా.. నేను అధికారంలోకి రాగానే ప్రజావేదిక నిర్మాణం మళ్ళీ జరుగుతుంది అని చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Peddireddy: భవిష్యత్త్ లేని చంద్రబాబు.. ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారు..
ప్రజా పాలనకు నాంది పలుకుతుంది.. కౌరవ సభను ,గౌరవ సభగా మార్చి అసెంబ్లీలో అడుగు పెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. అందుకే జూన్ 4న సగౌరవంగా మళ్లీ గౌరవ సభలోకి అడుగు పెడతాను.. ఒక్క అమరావతికే కాదు రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది.. ప్రతి ఒక్కరూ సైకిల్ ఎక్కండి.. దాహం తీర్చుకోవడానికి చేతిలో గ్లాసు కూడా పెట్టుకోండి.. కమలం కూడా జేబులో పెట్టుకోండి.. మన మీటింగ్ లను చూస్తే జగన్ కు నిద్ర రాదు.. టీవీలు పగలగొడతాడు అంటూ ఆయన సెటైర్ వేశారు.