భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూప కల్పనలో ఆయన చేసిన కృషికి దేశ ప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారని తెలిపారు.
Read Also: BJP Manifesto: నేడే బీజేపీ మేనిఫెస్టో విడుదల..
కాగా, షెడ్యూల్డ్ కులాల విభాగంతో సహా నిర్లక్ష్యానికి గురైన అన్ని వర్గాల హక్కుల కోసం జీవితాంతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పోరాడారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సమాజంలోని అట్టడుగు స్థాయి వారి సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ స్ఫూర్తినిస్తూనే చెప్పుకొచ్చారు. వివక్ష లేని, సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని సీఎం యోగి పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని మోవ్ నగరంలో 1891వ సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జన్మించారు. ఆయన రాజ్యాంగ కమిటీ చైర్మన్‌గా పని చేశారు.