భారత జనతా పార్టీ తెలంగాణకు చేసింది ఏం లేదు.. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ సీట్లు గెలుస్తాం.. జూన్ 9వ తేదీన రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకు ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ, గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో.. కోఠిలోని సీబీఐ జీడీకి కంప్లైంట్ చేసినట్లు పాల్ తెలిపారు.
రైతులను ఆదుకొనే ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కులం, మతం పేరు మీద రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు.
ఒంగోలు లోక్ సభ నియోజక వర్గం నుంచి వైసీపీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తు్న్న ఆయన.. ఈ రోజు బేస్తవారిపేటలో ఆత్మీయ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
నిరుద్యోగులకు నైపుణ్యాలు పెంచుకునేందుకు ఏటా లక్ష రూపాయలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా? హామీలు ఎగ్గొట్టిన బీజేపీ కావాలా? అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
తెలంగాణకు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, నవోదయ స్కూళ్లు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపింది అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం జగన్ సున్నా వడ్డీతోని ప్రతి అక్కచెల్లమ్మలకు లక్షలాది రూపాయలను అందించారు.. వీటితో పాటు చేయూత, ఆసరా, కాపూ నేస్తంతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మేర తోడుగా అన్నతమ్ముడిలాగా ఈ నాలుగు సంవత్సరాల 10 నెలల కాలంలో సీఎం జగన్ ఒక్కరికి 90 వేల రూపాయలను నేరుగా వారి అకౌంట్లోకి వేశారని తెలిపారు.
ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఆదివారం) జరుగబోయే కీలక మ్యాచ్ కి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ పేసర్ మతీశ పతిరణ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు.