శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి జీవిమాను కూడలిలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర బహిరంగ సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబాయిని చంపుకుని ఇతరుల మీద నెట్టి అధికారంలోకి వచ్చిన సైకో జగన్. అలాంటి సైకోని గెలిపించి అనుభవిస్తున్నారు అని ఆరోపించారు. ప్రపంచ దేశాలకే తల మాణికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలోనే లేకుండా చేసిన వ్యక్తి జగన్.. స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలకి పేర్లు మార్చుకొని కొనసాగిస్తున్నారు అని ఆయన తెలిపారు. జగన్ సొంత చెల్లిని మోసగించిన వ్యక్తి ఈ విషయం ప్రతి మహిళా గుర్తించి సరైన తీర్పునివ్వాలి.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని బాలకృష్ణ తెలిపారు.
Read Also: Lip Lock : లిప్ లాక్ చేసేవారికి షాకింగ్ న్యూస్.. ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి..
కాగా, రాయలసీమలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సాగు నీరు పారిస్తే జగన్ మాత్రం రక్తం పారిస్తున్నారని నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. ఒక్క అవకాశం అని వర్గాలను నిండా ముంచారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆయన హెచ్చరించారు. ఈసారి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది.. అందరికి న్యాయం జరుగుతుంది అని టీడీపీ నేత, ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు.