ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించిడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ బిలియనీర్‌కు చెందిన ఎమ్‌ఎస్‌సి ఎరిస్ కంటెయినర్ షిప్‌ను గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఇరాన్ నేవీ స్వాధీనం చేసుకుంది. పోర్చుగల్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 25 మంది సిబ్బంది ఉండగా.. వీరిలో 17 మంది భారతీయులు ఉన్నారు. వీరి విడుదల కోసం భారత ప్రభుత్వం ఇరాన్‌తో ఇప్పటికే సందప్రదింపులు కొనసాగిస్తుంది.
Read Also: Memantha Siddham: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం
కాగా, ఇజ్రాయెల్ నౌకను తీసుకెళుతున్నట్లు ఇరాన్ నేవీ ప్రకటించింది. నౌక డెక్‌పై ఇరాన్ కమాండోలు కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇజ్రాయెల్ బిలియనీర్ వ్యాపారవేత్తకు చెందిన జోడియాక్ మారిటైమ్ గ్రూపు ఈ నౌక నిర్వహణ కార్యక్రమాలు చేస్తుంది. అయిత, హెలికాప్టర్ ద్వారా ఇరాన్ నేవీ సిబ్బంది నౌకపై దాడి చేసి లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తుంది. హర్మూజ్ జలసంధి వైపు వెళ్తుండగా చివరి సారిగా ఎంఎస్‌సీ ఎయిరిస్‌ను గుర్తించారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి దీనిపై స్పందించారు.
Read Also: Ambedkar Jayanti: అంబేడ్కర్ కు నివాళులు ఆర్పించిన సీఎం యోగి ఆదిత్యనాథ్..
ఇరాన్ గార్డ్స్‌ను ఉగ్రవాదులుగా గుర్తించాలని ప్రపంచ దేశాలను ఇజ్రాయెల్ కోరింది. ఇరాన్‌లో ప్రస్తుతం క్రిమినల్స్ పాలన కొనసాగుతోంది.. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి పైరేట్ ఆపరేషన్‌లను ఆ దేశం నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కూడా ఇరాన్ సపోర్ట్ ఇవ్వడంతో మండిపడ్డారు. కాగా, ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులు చేయగా.. ఈ దాడిలో ఏడుగురు ఇరాన్ ఆర్మీ ఉన్నతాధికారులు చనిపోయారు. ఈ ఘటనతో ఆగ్రహించిన ఇరాన్, ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామని చెప్పింది.