ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి రైతు రుణమాఫీ చేయలేదు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆగస్ట్ 15వ తేదీ లోపు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం అన్నారు. వచ్చే సారి పండించే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేసే బాధ్యత నాదన్నారు.
పోలవరం ప్రాజెక్టు.. ఏపీకి జీవనాడిగా చెప్పుకుంటున్నారు.. కానీ.. ఇది ఎప్పడుు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. గతంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తానని చెప్పుకొచ్చారు.. ఏదో హాడావుడిగా పనులు చేశారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
ఉదయగిరి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన వింజమూరు పట్టణంలోని జై భీమ్ నగర్, జీబీకేఆర్ఎస్ టీ కాలనీలో ఆదివారం నాడు తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని గెలిపించాలని కాకర్ల సునీల్ సతీమణి కాకర్ల సురేఖ కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
రాష్ట్రంలో సానుభూతి కోసం పాకూలాడేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు అని తెలిపారు. మాకు సానుభూతి అవసరం లేదు.. ఎందుకంటే మా నాయకుడు ( జగన్ ) ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించారు.. ఆ ధీమాతోనే మేమే ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నాం.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైనా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. 13 సంవత్సరాలుగా రాయి మీద రాయి పేర్చినట్టుగా కార్యకర్తలు సైనికులాలగా కష్టపడి పార్టీని నిర్మించామని ఆయన తెలిపారు.
నాలుగు నెలలుగా గత ప్రభుత్వ పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. పాత నేరాలన్ని ఒక్కోటి బయటకు వస్తున్నాయి.. ఒక వైపు హామీల అమలు జరుపుతూనే , కేసీఆర్ పాపాల ప్రక్షాళన చేస్తుంది కాంగ్రెస్.. బీజేపీ, కేసీఆర్ రైతు దీక్షలు చూసి సమాజం నవ్విపోతుంది అని తెలిపారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహా దేవపూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేత గుడాల శ్రీనివాస్ డ్యాన్స్ చేస్తున్న వీడియో కలకలం రేపుతుంది. నాగార్జున నటించిన నేనున్నాను సినిమాలోని నన్నేలు మన్మధుడా అనే పాటకు ఆయన పోలీస్ స్టేషన్ లోనే డ్యాన్సులు చేస్తుండగా.. స్టేషన్ లోని కానిస్టేబుల్ ఎంకరేజ్ చేస్తూన్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేసింది.
భారత జనతా పార్టీ తెలంగాణకు చేసింది ఏం లేదు.. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.