జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహా దేవపూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేత గుడాల శ్రీనివాస్ డ్యాన్స్ చేస్తున్న వీడియో కలకలం రేపుతుంది. నాగార్జున నటించిన నేనున్నాను సినిమాలోని నన్నేలు మన్మధుడా అనే పాటకు ఆయన పోలీస్ స్టేషన్ లోనే డ్యాన్సులు చేస్తుండగా.. స్టేషన్ లోని కానిస్టేబుల్ ఎంకరేజ్ చేస్తూన్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేసింది. ఇక, ఈ ఘటనపై జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే విచారణ చేపట్టారు. ఆ సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు వేశారు. హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేడంతో పాటు మహాదేవపూర్ ఎస్ఐ ప్రసాద్ ను వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: Ayodhya Ram Mandir: భక్తులకు అలర్ట్.. 4 రోజులు రాంలల్లా దర్శనం, హారతి పాస్లు రద్దు
ఇక, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల కోసం పని చేయాల్సిన పోలీసులు తప్పు చేస్తే క్రమ శిక్షణ చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్లో పోలీస్ శాఖపై ప్రతిష్ట పెంచే విధంగా పని తీరు ఉండాలని ఎస్పీ పేర్కోన్నారు. ఇక, జడ్పీటీసీ భర్తపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇదే విషయంపై గుడాల శ్రీనివాస్ వివరణ ఇచ్చారు.. ఆ వీడియోను కూడా తనతో ఉన్న వాళ్లే తీశారన్నారు. డ్యాన్స్ వేరే ఉద్దేశంతో చేసింది కాదు.. అయితే, తానే ఒక గ్రూపులో పోస్టు చేయగా.. దీనిని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన తెలిపారు.