నాలుగు నెలలుగా గత ప్రభుత్వ పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. పాత నేరాలన్ని ఒక్కోటి బయటకు వస్తున్నాయి.. ఒక వైపు హామీల అమలు జరుపుతూనే , కేసీఆర్ పాపాల ప్రక్షాళన చేస్తుంది కాంగ్రెస్.. బీజేపీ, కేసీఆర్ రైతు దీక్షలు చూసి సమాజం నవ్విపోతుంది అని తెలిపారు. బీజేపీ గత పదేళ్ళుగా రైతులకు ఏం చేశారో చెప్పి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర పర్యాటన శాఖ మంత్రి కిషన్ రెడ్డి దీక్షలు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. పదేళ్ళుగా బీజేపీ చేయనివి నాలుగు నెలల్లో కాంగ్రెస్ చేయాలని ఎలా ప్రశ్నిస్తారు.. సంక్షేమం గురించి పట్టించుకోకపోతే బీజేపీ , బీఆర్ఎస్ కి వేసిన శిక్షే ప్రజలు కాంగ్రెస్ కి వేస్తారు అని చెప్పుకొచ్చారు. అకాల వర్షాలకు సాగు నీరు లేక ఎండిపోయిన పంటలకు ఎకరాకు 10 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.
Read Also: CM YS Jagan: రాయి దాడి ఘటనపై జగన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేన సాంబశివరావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 100 శాతం బడ్జెట్ ఉంటే.. 25 శాతం కాంట్రాక్టర్ కు.. 25 శాతం రాష్ట్ర పాలకులకు చేరింది అని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో దుమ్ము గూడెం, ధవళేశ్వరం ఇలా ఎన్నో ప్రాజెక్టులు కట్టారు.. వాటిని ఏళ్ల కింద నిర్మాణించారు.. ఆ ప్రాజెక్టులు ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నాయని ఎమ్మెల్యే సాంబశివ రావు తెలిపారు.