జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైనా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. 13 సంవత్సరాలుగా రాయి మీద రాయి పేర్చినట్టుగా కార్యకర్తలు సైనికులాలగా కష్టపడి పార్టీని నిర్మించామని ఆయన తెలిపారు. రాసీ పోసిన కుప్ప మీద వచ్చి కూర్చొని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేశాడు.. నా కూతురుకు ఎంపీ టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటా లేదంటే కాంగ్రెస్ కు పోతా అని కడియం బ్లాక్ మెయిల్ చేశాడు అని రాజయ్య ఆరోపించారు.
Read Also: RCB vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..
కడియం శ్రీహరి ఎంత నిచూడో, నమ్మక ద్రోహి అనేది ప్రజలకు అర్థం అవుతుంది అని మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి డబ్బులు అందుకుని కాంగ్రెస్ తో బేరమాడి టికెట్ పొందాడు అని ఆయన ఆరోపించారు. కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలియదు.. అయ్యా జుట్టు బిడ్డచేతిలో ఉంది.. కడియం శ్రీహరి కుల వారసత్వం మీద అనుమానాలు ఉన్నాయన్నారు. కడియం కావ్య మాతంతర వివాహం చేసుకుంది.. నీకు సిగ్గు షెరం ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చెయ్యి గుర్తు మీద గెలువు అని రాజయ్య సవాల్ చేశారు.