పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతో మంది వైఎస్సార్సీపీలో చేరారు. అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కొరివి నాగరాజు, గుడారి శ్రీను, వల్లభారపు హనుమంతరావు, మంద ప్రభావతి, మంద ప్రభాస్, మంద నాగేశ్వరరావు, జవ్వాజి పాపయ్య. తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. వారందరికి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పని చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటాను.. ఎవరికి ఏ అవసరమొచ్చినా.. తాను ఉన్నాను అనే విషయం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే నంబూరి శంకరరావు సూచించారు.
Read Also: Peddireddy Ramachandra Reddy : చంద్రబాబు హయాంలో టీడీపీ వారికి మాత్రమే పథకాలు అందించారు
అలాగే, పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజాభిమానం చూస్తుంటే రాష్ట్రంలో 2019 ఎన్నికలు రిపీట్ అవడం గ్యారంటీ అనిపిస్తోందని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. జగనన్న పాలనలో మీ కుటుంబాలకు మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండాలని కోరారు. చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధికి, అందిన సంక్షేమానికి.. జగనన్న పాలనలో జరిగిన మంచికి తేడా చూడాలన్నారు. జగనన్న పాలనలో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడ్డాయి, దళారీలు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల అరాచకాలు మాత్రమే జరిగాయి.. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే అవే అక్రమాలు, అన్యాయలు రిపీట్ అవుతాయన్నారు. ముఖ్యమంత్రి పేదల కోసం 125 సార్లు బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందించారన్నారు. ప్రజలు కూడా కేవలం రెండు సార్లు బటన్ నొక్కి రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు. తమను మరోసారి ఆశీర్వదిస్తే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాను అని ఎమ్మెల్యే నంబూరి శంకరరావు పేర్కొన్నారు.