నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన వింజమూరు పట్టణంలోని జై భీమ్ నగర్, జీబీకేఆర్ఎస్ టీ కాలనీలో ఆదివారం నాడు తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని గెలిపించాలని కాకర్ల సునీల్ సతీమణి కాకర్ల సురేఖ కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ కి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేఖ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆరు పథకాలను తప్పకుండా అమలు చేస్తారని రాష్ట్ర భవిష్యత్తును బంగారు మయం చేస్తారని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పన నిరుద్యోగ భృతి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మూడు సిలిండర్లు ఉచిత పంపిణీ తదితర అంశాలతో కూడిన మేనిఫెస్టోను తప్పక అమలు చేస్తామని చెప్పారు.
Read Also: Iran: ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్‌లో పర్యటించనున్న ఇరాన్ అధ్యక్షుడు..
ప్రస్తుత రాష్ట్రంలో అరాచకం దౌర్జన్యం నడుస్తుందని బంగారు ఆంధ్ర ప్రదేశ్ ను 20 సంవత్సరాలు వెనుకకు తీసుకెళ్లారని చంద్రబాబు రాగానే ఆంధ్రప్రదేశ్ ఇక భవిష్యత్తులో మారుస్తార ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేఖ అన్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దే విధంగా చంద్రబాబు నిలబెడతారన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి సొంత నిధులతో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ ప్రజలకు చేరువయ్యాయి. ఈ పథకాలను ఈ ట్రస్ట్ ద్వారా 25 సంవత్సరాల వరకు కొనసాగిస్తానని వారు తెలియజేశారు. ఇప్పటికే ట్రస్ట్ ద్వారా ఎంతో మంది యువతులకు కుట్టు శిక్షణ అందించి వారి జీవనోపాధికి బాటలు వేసేమన్నారు. ఆరోగ్య రథం ద్వారా ఎంతోమందికి వైద్య సేవలు అందించి గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడమని తెలిపారు. అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతోమంది పేదవారే ఆకలి తీర్చాను అన్నారు. సొంత నిధులతో సుమారు 16 పథకాలు మెట్ట ప్రాంత ప్రజలకు చేరువ చేశారన్నారు. అధికారం ఉంటే మరెన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు సాధిస్తారు.. ముందుగా ఆయా గ్రామాల్లోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకర్ల సురేష్ కి అడుగడుగునా కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా యువత తమ మొదటి ఓటు తెలుగుదేశం పార్టీకేనని కాకర్ల సురేఖ చెప్పారు.