ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఆదివారం) జరుగబోయే కీలక మ్యాచ్ కి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ పేసర్ మతీశ పతిరణ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు.
అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల క్రితం ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఆయన కీలక అప్డేట్ ఇస్తూ.. ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా.. అభిమానులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.
ఇజ్రాయెల్‌కు రక్షణగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని ప్రధాని నెతన్యాహుకు తెలిపాను అని ఆయన చెప్పుకొచ్చారు.
50 గ్రాముల బరువున్న ఈ నాణెం ధర 5,860 రూపాయలు మాత్రమే.. ఇది 999 స్వచ్ఛమైన వెండితో తయారు చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని ఎస్‌పీఎంసీఐసీఎల్‌ఐ వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చు అని తెలిపారు.
బ్రిటన్‌కు తొలి భారత సంతతి ప్రధానిగా చరిత్ర సృష్టించిన కన్సర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్‌కు వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఏర్పాడింది అని విశ్లేషకులు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు మణిపూర్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు ప్రారంభమయ్యాయి. కంగ్పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామంలో కుకీ, మోతీ సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. కము సైచాంగ్ గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.
ఇవాళ ఎంతో మంచి రోజు.. ఉత్తమ మేనిఫెస్టోను తయారు చేసిన రాజ్‌నాథ్ సింగ్‌ను అభినందిస్తున్నాను.. అలాగే, మేనిఫెస్టో కమిటీకి అభినందనలు తెలిజేస్తున్నాను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ముంబయిలో సల్మాన్ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘సంకల్ప్ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ప్రధాని మోడీ రిలీజ్ చేశారు.