నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జన జాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన మాట మేరకు మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశామన్నారు. కృష్ణ – వికారాబాద్ రైల్వే లైన్ పదేళ్లు పడవ్ పెడితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.. కాంగ్రెస్ పార్టీ తరపున కాంట్రాక్టర్లు, ధనవంతులకు టిక్కెట్లు ఇవ్వలేదు.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ముదిరాజులకు ఒక్క సీటు ఇవ్వలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ముదిరాజులు బీసీ- డీ నుంచి బీసీ- ఏగా మారాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాలన్నారు. మెదక్ లో నీలం ముదిరాజ్ ను గెలిపించండి.. తెలంగాణలో 14 ఎంపీ సీట్లను గెలిపించండి ఆగస్ట్ 15 తర్వాత ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది అన్నారు. అలాగే, ఉద్దండులైన న్యాయవాదులను పెట్టించి సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల వర్గీకరణపై కొట్లడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: SRH vs RCB: భారీ స్కోరు చేసిన సన్ రైజర్స్.. ఆర్సీబీ బౌలర్లపై ఊచకోత
అయితే, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి రైతు రుణమాఫీ చేయలేదు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆగస్ట్ 15వ తేదీ లోపు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం అన్నారు. వచ్చే సారి పండించే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేసే బాధ్యత నాదన్నారు. ఎంపీ ఎన్నికలు ముగిసిన రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.. ఎంపీ ఎన్నికల్లో బూతుల్లో మెజారిటీ ఎవరు తెస్తారో వారికి టికెట్ల ఇచ్చి గెలిపిస్తాం.. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు వేయబోతున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం 5 ఎంపీ స్థానాల్లో మోడీనీ గెలిపించేందుకు సుపారి తీసుకొని నాయకుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు.. బిడ్డ పెళ్లి ఉన్నప్పుడు వదలకుండా నన్ను జైల్లో పెట్టారు.. బిడ్డ జైలుకు పోగానే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాడు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Rice size: సంగారెడ్డి జిల్లాలో 500 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ఇక, మేము అధికారంలోకి రాగనే 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లకు రూ. 5లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని సీఎం రేవంత్ చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని అంటున్నారు.. ఇళ్లు, ఉచిత ప్రయాణం, కరెంటు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, బిసి జనాభా , 30వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు ఓడ గొడతారా? అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో కేసీఆర్ 100 ఏళ్ల విధ్వంసం సృష్టిస్తే ఒక్కోక్కటిగా చక్కదిద్దుతున్నా.. ఒక్క రోజు సెలవు పెట్టకుండా పని చేస్తున్నాను.. బీజేపీ ముసుగులో బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కై రేవంత్ రెడ్డిని ఓడగొట్టలని చూస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా BRSకు ఓటు వేయమని అడుగుతున్నారా?.. మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీనీ గెలిపించేందుకు BRS కుమ్మైకయ్యారు అని ఆయన చెప్పుకొచ్చారు.