తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో ఎన్డీయే కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటిఇంటికి తిరిగిన కొలికపూడికి మహిళలు మంగళ హారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పని చేస్తాను.. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేయండి తిరువూర్ ను అభివృద్ధి చేసి చూపిస్తానని కొలికపూడి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
Read Also: Patnam Suneetha Reddy: మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే..!
ఇక, తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో మేదర సంఘానికి చెందిన 300 మంది ప్రజలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో కలిసి తనదైన స్టైల్ లో మాస్ స్టేపులు వేసిన కొలికపూడి ఉర్రూతలూగించారు. మెదర సంఘం ప్రజలు మేము ఒకే ఇంటిలో మూడు, నాలుగు కుటుంబాలు జీవిస్తున్నామన్నారు. ఏదైనా ఫంక్షన్స్, కానీ ఎవరైనా చనిపోయిన, కానీ రోడ్ల మీదే కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని కొలికపూడికి తెలియ జేశారు. ఇక, మీ అందరికి త్వరలోనే ఇళ్ల స్థలాలను ఇస్తామన్నారు. 500 మందికి సరిపోయే ఫంక్షన్ హాల్ కట్టిస్తాను అని హామీ ఇచ్చారు.
Read Also: Samantha : పెళ్లి డ్రెస్సును సామ్ ఎంత అందంగా రీమోడలింగ్ చేయించిందో చూశారా?
కాగా, మీ అందరూ రెండు ఓట్లు టీడీపీకి వేయాలని తిరువూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఒకటి ఎంపీ ఓటు కేశినేని చిన్నికి, రెండో ఓటు నాకు వేసి గెలిపించాలన్నారు. మీ అందరి బాధ్యత నేను తీసుకుంటాను.. మీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని పేర్కొన్నారు. తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు జాబితాలో ఉంచుతాను.. కొలికపూడి ఇంటింటి కార్యక్రమంతో మెదర సంఘానికి చెందిన వార్డు మొత్తం పసుపు జెండాలతో నిండి పోయింది.