లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు ఇవాళ (ఆదివారం) కూడా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాస్గంజ్, మెయిన్‌పురి, ఇటావాలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొననున్నారు.
భారతీయ జనతా పార్టీ ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ అభ్యర్ధిని ప్రకటించింది. ముంబై 26/11 ఉగ్రదాడిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను ఎన్నికల బరిలోకి దింపింది.
తమ మేనిఫెస్టో గురించి వివరించేందుకు ప్రధాని మోడీతో సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల సమయం అడిగారు. దీనిని ఉద్దేశించి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలకు ఖర్గే ఘాటుగా సమాధానం ఇచ్చారు.
కర్ణాటక రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని కూడా కూడా దెబ్బ తీస్తున్నారని వ్యాఖ్యానించారు.
దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టో చాలా బాగుందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో అనగానే జగనన్న రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉండేలా రిలీజ్ చేశారన్నారు.
దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు రోజు రోజుకు పడిపోతున్నాయని సీబ్ల్యూసీ తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నీ నగలు, మంగళసూత్రం దొంగిలించి వేరొకరికి ఇస్తానని మోడీ మామయ్య ఎప్పుడో ఒకప్పుడు చెప్పడం మొదలు పెట్టే అవకాశం ఉందని ప్రియాంక గాంధీ తెలిపారు.