ఎండాకాలం వచ్చిందంటే దక్షిణ భారతదేశం నీటి ఎద్దడిని ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పాడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మాత్రమే నీటి నిల్వ మిగిలి ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసీ) ఈ విషయాన్ని తెలిపింది. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రిజర్వాయర్ల నిల్వ స్థాయికి సంబంధించి CWC గురువారం నాడు జాబితాను విడుదల చేసింది. దక్షిణ భారత్ లో కమిషన్ పర్యవేక్షణలో 42 రిజర్వాయర్లు ఉన్నాయని చెప్పింది. మొత్తం 53.334 BCM (బిలియన్ క్యూబిక్ మీటర్) నిల్వ సామర్థ్యం ఉందని చెప్పుకొచ్చింది.
Read Also: Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
ఇక, తాజా నివేదిక ప్రకారం.. ఈ రిజర్వాయర్లలో ప్రస్తుత మొత్తం నీటి నిల్వ 8.865 BCM మాత్రమే ఉందని తెలిపింది. ఇది వాటి మొత్తం సామర్థ్యంలో 17 శాతం మాత్రమేనని చెప్పింది. ఈ సంఖ్య గత సంవత్సరం ఇదే కాలంలో నిల్వ స్థాయి 29 శాతం ఉండగా ప్రస్తుతం పదేళ్ల సగటు (23 శాతం) కంటే తక్కువకు పడిపోయిందని సీబ్ల్యూసీ వెల్లడించింది. అయితే, దక్షిణ భారతదేశంలోని రిజర్వాయర్లలో తక్కువ నీటి నిల్వ స్థాయిలు ఈ రాష్ట్రాలలో పెరుగుతున్నప్పటికి.. నీటి కొరత, నీటి పారుదల, తాగునీరు, జలవిద్యుత్‌కు సవాళ్లగా మారినట్లు చెప్పుకొచ్చింది. అయితే, అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో నీటి నిల్వ స్థాయిలు ఘనంగా పెరిగినట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ బోర్డు వెల్లడించింది.
Read Also: Chandrababu: అధికారంలోకి వస్తే హామీలు అమలు చేస్తాం
అయితే, భారతదేశంలో మొత్తం 20.430 బీసీఎంల స్టోరేజీ కేపాసిటీ ఉన్న 23 మానిటరింగ్ రిజర్వాయర్లలో ప్రస్తుతం 7.889 బీసీఎంల నీరు ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. ఇది మొత్తం సామర్థ్యంలో 39 శాతమని చెప్పుకొచ్చింది. పశ్చిమ ప్రాంతంలో గుజరాత్, మహారాష్ట్రలో కూడా నీటి నిల్వ స్థాయిలు 11.771 BCMగా ఉందని వెల్లడించింది. అలాగే, ఉత్తర, మధ్య భారతదేశంలో కూడా నీటి నిల్వ స్థాయిలు క్రమంగా క్షీణిస్తున్నాయని సీబ్ల్యూసీ చెప్పింది.