భారతీయ జనతా పార్టీ ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ అభ్యర్ధిని ప్రకటించింది. ముంబై 26/11 ఉగ్రదాడిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను ఎన్నికల బరిలోకి దింపింది. సిట్టింగ్ ఎంపీ పూనమ్ మహాజన్ స్థానంలో ఆయనను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసింది. గత కొంతకాలంగా బీజేపీ అంతర్గతంగా చేయించిన సర్వేల్లో పూనమ్ మహాజన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పార్టీ నేతలు చెప్పినట్లు పీటీఐ పేర్కొంది. పూనం మహాజన్‌ను తొలగించే సూచనలు ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరిగింది. కాగా, కాంగ్రెస్ పార్టీ ధారావి సిట్టింగ్ ఎమ్మెల్యే ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ అభర్థి వర్షా గైక్వాడ్‌తో ఉజ్వల్ నికమ్ పోటీ పడబోతున్నారు. మే 20వ తేదీన జరగనున్న ఐదో విడత ఎన్నికలో ముంబైలో పోలింగ్ జరగబోతుంది.
Read Also: Chandrababu: ప్రసన్న కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే చేసింది నేనే
ఇక, 1993 ముంబై బాంబు పేలుళ్లు, గుల్షన్ కుమార్ హత్య కేసు, ప్రమోద్ మహజన్ కేసు, 2008 ముంబై దాడుల కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించిన ఉజ్వల్ నికమ్ బాగా కష్టపడ్డాడు. 2013 ముంబై గ్యాంగ్ రేప్ కేసు, 2016 కోపర్దీ రేప్, మర్డర్ కేసుల్లో ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా కూడా ఆయన పని చేశారు. నికమ్ విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. కాగా, ఉజ్వల్ నికమ్ తన న్యాయవాద వృత్తిలో 30 ఏళ్ల కెరీర్‌లో 628 జీవిత ఖైదు, 37 మందికి మరణశిక్ష విధించేలా చేశారు.