Onion Price: లోక్‌సభ ఎన్నికల వేళ ఉల్లి ఎగుమతులపై మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు లక్ష టన్నులకు పైగా ఉల్లి ఎగుమతులకు పర్మిషన్ ఇచ్చింది. కేంద్రం నిర్ణయంతో ఉల్లి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, బహ్రెయిన్, మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ లకు ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర సర్కార్ తెలిపింది. దీంతో పాటు మధ్య ఆసియా, ఐరోపా దేశాలకు మరో 2 వేల టన్నుల తెల్ల రకం ఉల్లిని ఎగుమతి చేసేందుకు కూడా అనుమతులు ఇచ్చింది. ఈ ఎత్తివేత ఐదు నెలల పాటు అమల్లో ఉంటుందని వెల్లడించారు.
Read Also: Vishwak Sen : ఎప్పటికైనా ఆయనంత గొప్ప నటుడిని కావాలి..
ఇక, ఈ దేశాలకు ఉల్లిని ఎగుమతి చేసే ఏజెన్సీ నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ దేశీయ ఉత్పత్తులను చర్చల ప్రాతిపదికన 100 శాతం ముందస్తు చెల్లింపు రేటుతో ఎల్-1లో ఈ-ప్లాట్‌ఫారమ్ ద్వారా సేకరించి, సరఫరా చేసిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది. 2023-24లో ఖరీఫ్, రబీలో పంట దిగుబడి తగ్గడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ఉల్లికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది.