ఇవాళ (బుధవారం) ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. చివరిదైనా ఏడో దశలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనున్నట్లు షెడ్యూల్ రూపొందించారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థకు చెందిన సీనియర్ సిబ్బంది ఒకేసారి సిక్ లీవ్ పెట్టారు. దీంతో మంగళవారం నాడు రాత్రి నుంచి ఇవాళ (బుధవారం) తెల్లవారుజాము వరకు సుమారు 70 విమానాలను రద్దు చేసింది.
తాము తయారు చేసిన కరోనా టీకాను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తెలిపింది. వాణిజ్యపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
బహుజన్ సమాజ్ పార్టీ ( బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకుంది. తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్తగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
చైనా అనుకూల మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఆరు నెలల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ రేపు ( మే 9) భారత్‌ను సందర్శించనున్నారు.
ఈ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లు గెలడమే మా టార్గెట్ అన్నారు. 100 రోజుల పాలనను చూసి తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39. 50 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ లోక్ సభ ఎన్నికల్లో మా ఓట్ షేర్ పెరిగిన లేదా తగ్గకున్నా మేం పాసైనట్లే.. రెఫరెండం అంటే అదీ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కిషన్ రెడ్డి చెప్పినట్లు రూ. 10 వేల కోట్లను.. ఏ శాఖకు, ఎన్ని నిధులు, ఏ ప్రాజెక్టులకు ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం శ్వేత పత్నం విడుదల చేయాలి.. నిధుల శ్వేతపత్రంపై అమరవీరుల స్థూపం దగ్గరకు కిషన్ రెడ్డితో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.