ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్ లో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు కొండా ప్రాంతంలో పర్యటిస్తునాం.. ప్రతి ఇంటికి వెళ్తుంటే వాలంటరీలు ఉన్నప్పుడు మాకు పెన్షన్ మా గడపకే తెచ్చేవారు అని చెబుతున్నారు.. మేము మళ్ళీ జగనన్న గెలిపించుకుంటామని చెప్తున్నారని ఆమె అన్నారు. చెట్టు పేరు చెప్పుకొని కొంతమంది కాయలు అమ్ముకునే మోసగాళ్లు వస్తున్నారు.. 13వ తారీఖున బ్యాలెట్ కి వెళ్ళినప్పుడు రెండు కేశినేని పేర్లు కనబడతాయి.. ఒకరు కేశినేని నాని మీ ప్రియతమ నాయకులు నిరంతరం మీ కోసం కష్టపడే వ్యక్తి అని చెప్పారు. 8000 కోట్ల రూపాయలతో విజయవాడను అభివృద్ధి చేసిన వ్యక్తి మీ కేశినేని నాని శ్వేత చెప్పుకొచ్చారు.
Read Also: Chandrababu: కల్లూరు సభలో భూహక్కు పత్రాన్ని తగలబెట్టిన చంద్రబాబు
కాగా, కేశినేని భవన్ ద్వారా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కేశినేని నాని ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారు అని కేశినేని శ్వేత తెలిపారు. బ్యాలెట్ లో రెండో నెంబర్ కేశినేని నానిది అందరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలి అని కోరారు. ప్రతి ఒకళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి.. అటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి 150 కోట్లుతో సీటు కొనుక్కున్న బ్యాంకు స్కామర్ మధ్య తరగతి ప్రజల పొట్ట కొట్టిన వ్యక్తి కేశినేని చిన్ని అంటూ ఆమె మండిపడ్డారు. కేశినేని నాని ఓటు బ్యాకు చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు.. ఎంపీ బంధువులను చెప్పుకొని అందరిని కలుస్తున్నారు.. ఓటు వేసేటప్పుడు ప్రజలందరూ ఫ్యాన్ గుర్తు చూసి ఓటు వేయాలి.. గత ఐదు సంవత్సరాల నుంచి వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇంటికి వెళ్లి అందేది.. కొండా ప్రాంత ప్రజలు పెన్షన్ రాక బ్యాంకులు చుట్టూ.. సచివాలయల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేశినేని శ్వేత చెప్పుకొచ్చారు.
Read Also: Dhanush : మరో తెలుగు దర్శకుడితో ధనుష్ మూవీ..?
పేదలకు పెన్షన్ రాకుండా అడ్డుకుంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలే అని కేశినేని శ్వేత పేర్కొన్నారు. వాలంటరీలని చూస్తే జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నట్టు ప్రజలు భావించేవారు.. అలాంటి వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఓట్లు పడిపోతాయని భయపడుతున్నారు.. అవ్వ తాతల ఊసురు కచ్చితంగా చంద్రబాబుకు తగులుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.. నవరత్నాలు వల్ల రాష్టం శ్రీలంక అయిపోతుందన్నారు.. మరి ఇప్పుడు అదే నవరత్నాలను కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు.. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇలాంటి దొంగ హామీలు ఇస్తే ప్రజలు రాళ్లు పెట్టి కొడతారంటూ కేశినేని శ్వేత ఆరోపించారు.