నేడు రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖ లోక్ సభ పరిధిలో జగన్ ఎన్నికల ప్రచార సభలు.. ఉదయం 10 గంటలకు రాజానగరం దగ్గర కోరుకొండ జంక్షన్ లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం.. మ. 12.30 గంటలకు ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీసు సెంటర్ లో జగన్ ఎన్నికల ప్రచారం.. మ. 3 గంటలకు విశాఖ లోక్ సభ పరిధి పాత గాజువాక సెంటర్లో జగన్ సభ..
నేడు రాజంపేట పార్లమెంట్ పరిధిలో పుంగనూరు నియోజకవర్గంలో అలాగే.. తిరుపతి పార్లమెంట్(ఎస్సీ) పరిధిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజాగళం సభలో పాల్గొననున్నారు.
నేడు బద్వేల్ కి రానున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. బద్వేలు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద బహిరంగ సభ..
నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు..
నేడు ముత్తుకూరు, పొదలకూరు మండలాల్లో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నేడు ఉదయగిరి, జలదంకి మండలాల్లో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న నెల్లూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్
నేడు వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు షోలు.. సాయంత్రం 6 గంటకు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో .. 7 వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు మెదక్ జిల్లాలోకి ప్రవేశించనున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర.. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో రాత్రి 8 గంటలకు కేసీఆర్ రోడ్ షో.. కేసీఆర్ సొంత జిల్లా కావడంతో రోడ్ షోకి భారీగా జన సమికరణకి ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్
నేడు మెదక్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటన.. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి కొండా
నేడు సంగారెడ్డి జిల్లాకి రానున్న రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ.. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నారాయణఖేడ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రాజస్థాన్ సీఎం
నేడు సంగారెడ్డి జిల్లాలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పర్యటన.. సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ లోని హనుమాన్ దేవాలయం నుంచి పోతిరెడ్డిపల్లి వరకు బైక్ ర్యాలీలో పాల్గొననున్న అన్నామలై
నేడు కమ్మ వారి ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొననున్న కాకతీయ సామ్రాజ్య 22 వ వారసుడు మహారాజ్ కమల్ చంద్ర భారాజ్ దేవ్… బీజేపీకి మద్దతుగా కార్యక్రమం
నేడు కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డికి మద్దతు గా ఖమ్మంలో సినీ నటుడు వెంకటేష్ రోడ్ షో.. కొత్తగూడెంలో ఆత్మీయ సమావేశం
నేడు మేడిగడ్డకు జస్టీస్ పినాకి చంద్రఘోష్ రాక.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు ఆదేశించిన నేపద్యంలో పర్యటన.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో దెబ్బతిని ,కుంగిపోయిన పియర్లను పరిశీలించనున్న జ్యుడిషియల్ కమీషన్ చైర్మన్.. 3.30 గంటల నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ దర్శనం.. అనంతరం రామగుండంలోని విశ్రాంతి గృహంలో రాత్రి బస.
నేడు దేశవ్యాప్తంగా మూడో దశ ఎన్నికల పోలింగ్.. గుజరాత్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రధాని మోడీ..
నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.