చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టింది
చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖలో జీఎంఆర్, మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూ సిటీ ఒప్పంద కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు పాల్గొని మాట్లాడారు. ఇన్నేళ్లుగా వెనుకబడిందని చెప్పుకుంటూ వచ్చిన ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని తెలిపారు. ఉత్తరాంధ్రకు ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే.. అభివృద్ధి మాత్రం చంద్రబాబు హయాంలో జరుగుతోందని చెప్పారు. అభివృద్ధి ప్రణాళికల అమల్లో చంద్రబాబే నిద్రపోనివ్వరంటే.. ఇప్పుడు లోకేష్ అసలే పడుకోనివ్వడం లేదన్నారు. పార్టీలు.. రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. రూ.10 వేలు డొనేషన్ ఇచ్చి లక్ష రూపాయల పబ్లిసిటీ చేసుకునే రోజుల్లోనూ నానో కారులో తిరుగుతూ సింపుల్‌గా ఉండే నాయకుడు అశోక్‌గజపతిరాజు అని కొనియాడారు.
OG డైరెక్టర్ సుజిత్ కు పవర్ స్టార్ ఖరీదైన గిఫ్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ చిత్రం ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి తొలిఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న OG పలు రికార్డులు బద్దలు కొట్టింది. చాలా కలాంగా హిట్ లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన సినిమా OG. వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు రాబట్టి పవర్ స్టార్ కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు సుజీత్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల్యాండ్ రోవర్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. తన అభిమాన నటుడు ప్రేమతో ఇచ్చిన కానుకను అందుకున్న దర్శకుడు సుజిత్’ నాకు ఇప్పటివరకు లభించిన అత్యుత్తమ బహుమతి. ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంతగా ప్రేమతో నిండిపోయింది. నా ఫెవరెట్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రేమ, ప్రోత్సాహం మరువలేనిది నా చిన్ననాటి నుండి ఆయనను ఆరాధిస్తూ పెరిగాను ఇప్పుడు ఆయన చేతులమీదుగా గిఫ్ట్ అందుకుకోవడం నాకు ఒక ప్రత్యేక అనుభూతి. నేను ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
దారుణం.. చిన్నారిని థర్డ్ ఫ్లోర్ నుంచి కింద పడేసిన కన్న తల్లి
మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో దారుణం చోటుచేసుకుంది. దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడని ఓ మూడ నమ్మకంతో ఓ తల్లి.. కన్నకూతురినే మూడంతస్థుల బిల్డింగ్ పై నుంచి పడేసింది. ఈ ఘటన స్థానికంగా అందరిని కలచివేసింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తివివరాల్లోకి వెళితే.. మల్కాజ్ గిరి వసంతపురి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. తన పాపను దేవుడు మళ్లీ పుట్టిస్తాడని ఓ మూడ నమ్మకంతో మోనాలిసా అనే మహిళ తన కడుపులో పుట్టిన పాపను బిల్డింగ్ పై నుంచి పడేసింది. మూడో అంతస్థు నుంచి పడేయంతో ఏడేళ్ల చిన్నారి షారోనికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే.. తల్లి అలా ఎందుకు చేసిందో ఎవరికి అర్థం కావడం లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం తల్లిపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు.
టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. జనవరి 3 నుంచి ఆన్లైన్ పరీక్షలు..
తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) జనవరి -2026 పరీక్షల షెడ్యూల్‌ను సంబంధిత అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి 20 వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 9 రోజుల్లో 15 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రతి రోజూ రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. సెషన్–I పరీక్ష ఉదయం 9.00 గంటల నుంచి 11.30 గంటల వరకు కొనసాగుతుంది. సెషన్–II పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలి..!
విజయవాడ భవానీపురంలో వైఎస్ జగన్ పర్యటించారు. భవానీపురంలోని జోజీనగర్ లో 42 ప్లాట్ల బాధితులను ఆయన పరామర్శించారు. భవానీపురంలో ఇటీవల ఇళ్లను కోల్పోయిన 42 కుటుంబాల తరుపున ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని.. ఈనెల 31వ తేదీ వరకు 42 కుటుంబాలకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చిందన్నారు. అయితే పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఇళ్లను కూల్చేశారని.. 31వ తేదీ వరకు గడువు ఉన్నా అధికార దుర్వినియోగం చేసారని మండిపడ్డారు. ఇళ్లు కూల్చేసి 42 కుటుంబాలను రోడ్డుపాలు చేశారన్నారు. 2.17 ఎకరాల విలువ రూ.150కోట్లు పైగా ఉంటుందని.. 42 కుటుంబాలు 25ఏళ్లుగా ఇక్కడే ఇళ్లు కట్టుకుని ఉంటున్నాయని, వాళ్ల ఇళ్లను ధ్వంసం చేసారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
జోర్డాన్‌లో యువరాజుతో మోడీ సందడి.. కారులో తిరుగుతూ ఏం చేశారంటే..!
ప్రధాని మోడీ జోర్డాన్‌లో కారులో తిరుగుతూ సందడి చేశారు. జోర్డాన్ యువరాజు ప్రిన్స్ అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా II తో కలిసి సందడి చేశారు. యువరాజుతో కలిసి కారులో జోర్డాన్ మ్యూజియంకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీఎండబ్ల్యూ కారు లోపల ముచ్చటించుకుంటూ వెళ్తున్నట్లుగా ఫొటోల్లో కనిపించింది. జోర్డాన్‌లోని అమ్మాన్‌లోని రాస్ అల్-ఐన్ జిల్లాలో జోర్డాన్ మ్యూజియం ఉంది. దేశంలోనే అతి పెద్ద మ్యూజియం ఇది. అత్యంత ముఖ్యమైన పురావస్తు, చారిత్రక కళాఖండాలు ఉంటాయి. ఈ మ్యూజియాన్ని చూసేందుకు యువరాజుతో మోడీ కారులో వెళ్లారు. యువరాజే స్వయంగా కారు నడిపారు.
సిడ్నీ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరి వద్ద భారత పాస్‌పోర్ట్..
ఆస్ట్రేలియా బోండీ బీచ్ మారణహోమంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులు యూదులను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఉగ్రవాదుల్ని సాజిద్ అక్రమ్(50), ఇతని కుమారుడు నవీద్ అక్రమ్(24)లుగా గుర్తించారు. అయితే, నిందితుల్లో సాజిద్ అక్రమ్ గతంలో భారతీ పాస్‌పోర్ట్ ఉపయోగించినట్లు తెలిసింది. దాడికి ముందు వీరిద్దరు గత నెలలో ఫిలిప్పీన్స్‌కు వెళ్లి వచ్చారు. అక్కడే తీవ్రవాద ఇస్లామక్ బోధకులనున కలుసుకుని, సైనిక తరహా శిక్షణ పొందారా? అని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
జనవరిలో మంత్రివర్గ విస్తరణ..?
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రిమండలి విస్తరణపై చాలా రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలో తెరపడే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం, జనవరిలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రిమండలిలో మరో ఇద్దరు మంత్రులను తీసుకోవడానికి వీలుంది, అంటే రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న ఇద్దరు లేదా ముగ్గురిని తొలగిస్తారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే, ఈ విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు
తెలంగాణ రాష్ట్రంలోని మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించే విషయంలో భద్రతా దళాలు ఈరోజు సంచలనాత్మక విజయాన్ని నమోదు చేశాయి. జిల్లాలోని కీలక మావోయిస్టు నాయకుడు బడే చొక్కారావు తో సహా మొత్తం 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో తొమ్మిది మంది మహిళా మావోయిస్టులు ఉండటం ఈ ఆపరేషన్ ప్రాధాన్యతను పెంచుతోంది. సిర్పూర్ యూ మండలం పరిధిలోని అటవీ ప్రాంతాలలో మావోయిస్టుల ఉనికి గురించి పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు ఈ ఆపరేషన్‌ను అత్యంత గోప్యంగా నిర్వహించారు. గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB), కొమరం భీం జిల్లా పోలీసు సిబ్బంది సంయుక్తంగా కాకిరబొడ్డు, బాబ్జీపేట అటవీ ప్రాంత శివార్లలో కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు ఆ ప్రాంతంలోని ఒక ఇంట్లో తలదాచుకున్నట్లు గుర్తించిన భద్రతా దళాలు, వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. వీరు కాల్పులు జరపవచ్చనే అనుమానం ఉన్న నేపథ్యంలో పోలీసులు పూర్తి సన్నద్ధతతో రంగంలోకి దిగారు.
సర్పంచులు గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికైన సర్పంచులను డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, విద్య, వైద్య సేవల మెరుగుదలపై సర్పంచులు ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌లో 2047 విజన్ డాక్యుమెంట్‌ను ప్రదర్శించినట్లు చెప్పారు. 2047 కల్లా రాష్ట్రంలో ఒక లక్ష 30 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు.