Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో మేము కేవలం 100 రోజులు మాత్రమే పరిపాలన చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన బాధ్యతలు చేపడితే.. మార్చి 17వ తేదీ నుంచి ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ కూడా ఎన్నికల అధికారుల పరిధిలోకి వెళ్లిపోయాయి అని తెలిపారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలను అమలు చేశామన్నారు. 3 నెలల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం.. బలహీల వర్గాల కులగనణకు ఆదేశాలు జారీ చేశామని చెప్పుకొచ్చారు. అలాగే, రాష్ట్రంలో డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదంతో అణిచివేస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. ఇక, ఆర్టీసీ బస్సులో ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మంది మహిళలు ఉచితంగా లబ్ది పొందారన్నారు. 40 లక్షల కుటుంబాలు రూ. 500 గ్యాస్ సిలిండర్ ద్వారా లబ్ధిపొందుతున్నారు.. 50లక్షల ఫ్యామిలీలు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ద్వారి లబ్ది పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Online Gaming Fraud: ఆన్‌లైన్ గేమ్స్ లో రూ.12 లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరకు ఆత్మహత్య..
కేసీఆర్ ప్రభుత్వం దిగిపోతూ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ అప్పుకు దాదాపు 30వేల కోట్ల రూపాయల మిత్తిని చెల్లించామన్నారు. కేసీఆర్ వారసత్వంగా ఎండిపోయిన చెరువులను ఇస్తే.. నీటి సమస్య లేకుండా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఇక, మేము 100 రోజుల్లో మా ప్రభుత్వానికి ప్రజలు 75 శాతం మార్కులు వేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఈ 10 ఏళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆయన ఆరోపించారు. అలాగే, కేసీఆర్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగికి ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదన్నారు. ఇక, 2014 కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను అని చెప్పాడు.. ఐదు సంవత్సరాలు చేయకపోవడంతో పాటు మళ్లీ 2018లో కూడా అదే మాట చెప్పి రైతులను మోసం చేశాడన్నారు. కానీ, ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.