ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్ లో పాఠ్యంశంగా దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని ఎంపిక చేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో టెన్త్ కొత్త పుస్తకాల్లో బన్నీ ఉత్సవానికి చోటు దక్కింది. ప్రతియేటా దసరా రోజు హోలగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో కర్రల సమరం గురించి ఈ పాఠ్యాంశంలో పొందుపర్చబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్–2024 యాత్ర నేడు (సోమవారం) ప్రారంభంకాబోతుంది. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 2, 580 మంది హాజీల పవిత్ర యాత్రకు ఏర్పాట్లు పూర్తైయ్యాయి. ఇవాళ ఉదయం 8 : 45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తొలి విమానం స్టార్ట్ కానుంది.
తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారి పల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హస్పటల్ కు తరలించారు.
పర్యావరణంలో మార్పుల కారణంగా ఇబ్బందులు పడుతున్న మాల్దీవులకు అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక సాయం అందడం లేదని ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జూ ఆందోళన వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు బీజేపీ రిజర్వేషన్లను తొలగించడానికి ప్రయత్నిస్తుండటంతో పాటు రాజ్యాంగ ప్రవేశికను తాము మార్చాలని చూస్తున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ క్రికెటర్లు అక్కడికి వెళ్లిపోయారు. అయితే, తొలి బృందంతో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇంకా వెళ్లలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వీరి మ్యాచ్లు కూడా లేవు.. అయినా వీళ్లు వెళ్లకపోవడానికి విభిన్న కారణాలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశంలో వేడిగాలులుల తీవ్రంగా వీస్తున్నాయి. మరికొద్ది రోజుల పాటు ఢిల్లీలో వేడిగాలులు విధ్వంసం సృష్టించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడేందుకు రెడీ అయింది. ఈ ఫైనల్ పోరులో కు ముందు ముగింపు వేడుకలు జరగబోతున్నాయి. ఈసారి ముగింపు వేడుకలు కలర్ఫుల్ గా కొనసాగనుంది.