Hajj Yatra 2024: ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్–2024 యాత్ర నేడు (సోమవారం) ప్రారంభంకాబోతుంది. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 2, 580 మంది హాజీల పవిత్ర యాత్రకు ఏర్పాట్లు పూర్తైయ్యాయి. ఇవాళ ఉదయం 8 : 45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తొలి విమానం స్టార్ట్ కానుంది. మొదటి విమానంలో ప్రయాణించే 322 మంది హజ్ క్యాంపు నుంచి ఉదయం 3. 30 గంటలకే గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకునున్నారు.
Read Also: America : అమెరికాను వణికించిన సుడిగాలి.. అనేక రాష్ట్రాల్లో విధ్వంసం.. 11 మంది మృతి
కాగా, హజ్ యాత్రకు వెళ్లే వారి సౌకర్యం కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఈద్గా జామా మసీదు దగ్గర మదర్సాలోని హజ్ వసతి క్యాంపులో ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి హజ్ క్యాంపు వద్దకు చేరుకున్న తొలి బృందానికి వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. 24 గంటలు పనిచేసేలా మదర్సా దగ్గర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్, వైద్య సహాయం అందించేలా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. మదర్సా వద్ద పరిశుభ్రమైన వాతావరణంలో టెంట్లు, ఎయిర్ కూలర్లు సిద్ధం చేసి నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నాట్లు ప్రకటించారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో నలుమూలల నుంచి 713 మంది ముస్లిం సోదరులు ప్రపంచవ్యాప్తంగా హజ్ యాత్రకు పేర్లు నమోదు చేసుకోగా, మొదటి విడతలో భాగంగా ఈరోజు 322 మంది గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లానున్నారు.