Road Accident: తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారి పల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హస్పటల్ కు తరలించారు. అయితే, వీళ్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: MLC Polling: నేడే ఎమ్మెల్సీ పోలింగ్.. ముగిసే వరకు144 సెక్షన్ అమలు..
అయితే, మృతులు నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇంకా మృతుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. కారు కల్వర్ట్‌లో ఇరుక్కున్న దాన్ని బట్టి అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు అంచనా వేశారు. ఇక, గడ్డపార సహాయంతో కల్వర్టుపై ఇరుక్కున్న కారు డోర్లను బద్ధలు కొట్టి మృతదేహాలను పోలీసులు బయటకు తీసేశారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ AP 26 BH 3435 కాగా.. మృతుల వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.