ఇండియా కూటమి 24 గంటలు అబద్దాలు ప్రచారం చేస్తోంది.. వారు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులను మనం చూడాల్సిన పరిస్థితి వస్తుందని నరేంద్ర మోడీ వెల్లడించారు.
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్- రాజౌరీ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన పీడీపీ (పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ) అధినేత మెహబూబా ముఫ్తీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ.. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగింది.
ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో ఉదయం 9 గంటల సమయానికి 10.82 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక, ఉదయం 9 గంటల వరకు ఢిల్లీలో 8.94 శాతం, ఉత్తరప్రదేశ్లో 12.33 శాతం, బీహార్లో 9.66 శాతం, పశ్చిమ బెంగాల్లో 16.54 శాతం నమోదు అయింది.
రష్యాకు డ్రోన్లను సరఫరా చేసినందుకు ఇరాన్ రక్షణ మంత్రి మహ్మద్ రెజా అష్టియాని సహా తొమ్మిది సంస్థలపై ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల ప్రభుత్వాలు అంగీకరించాయి.