నార్సింగి లో దారుణం చోటుచేసుకుంది. కాళ్ల పట్టీల కోసం వివాహితను దారుణంగా హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత ను హత్య చేసి కాళ్లకు ఉన్న పట్టిలను ఎత్తుకెళ్లారు హంతకులు. ఖానాపూర్ లో కలకలం రేపిన వివాహిత హత్య. నిన్నటి నుండి కనిపించకుండా పోయిన మోగుళమ్మ. భర్త నార్సింగీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించింది మోగుళమ్మ.
స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటన స్దలానికి చేరుకున్నారు నార్సింగీ పోలీసులు. వివాహితను అతి దారుణంగా తల పై బండరాయితో మోది హత్య చేసినట్లు గుర్తించారు. మెడ పై చేతుల పై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. హత్యకు ముందు హంతకుల మద్య పెనుగులాట జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.