ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయన తన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలంటూ వేసిన పిటీషన్ ను అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది.
మిజోరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ కూలిపోవడంతో 10 మంది కార్మికులు చనిపోయారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.
ఏడో దశ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన నరేంద్ర మోడీ.. గత 24 ఏళ్లుగా విపక్షాలు తనపై దౌర్జన్యం చేస్తున్నాయని అన్నారు. ఎన్నికలు జరిగినా, జరగకపోయినా.. ఈ వ్యక్తులు (ప్రతిపక్షాలు) దుర్వినియోగం చేసేందుకే ఇష్టపడుతారని విమర్శించారు.
భూ కుంభకోణం కేసులో నిందితుడైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ పిటిషన్పై జార్ఖండ్ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఈడీ తన సమాధానం దాఖలు చేయడానికి సమయం కోరింది.
రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడిలో అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం బాధకరం అని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో దాడి చేసి తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటించారు.
ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా సాధారణ రుతుపవనాలు ముందే వస్తున్నాయి.. దీని వల్ల ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండవచ్చని ఐఎండీ అధికారులు చెప్పుకొచ్చారు.
రఫాలో ఇజ్రాయెల్ దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 45 మంది సామాన్య పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనపై విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్లను భారీ తుఫాన్ కుదిపేస్తుంది. నాలుగు రాష్ట్రాల్లో తుఫాను కారణంగా 22 మంది మరణించడంతో పాటు వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి.
విపక్ష ఇండియా కూటమి జూన్ 1వ తేదీన ఢిల్లీలో సమావేశం కాబోతుంది. ఈ మీటింగ్కు రావాల్సిందిగా కూటమిలోని అన్ని పార్టీలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇప్పటికే సమాచారం ఇచ్చారు.
ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లే ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా ఖాళీ చేయించిన సిబ్బంది.