ఐపీఎల్(IPL 2024) ఫైనల్ మ్యాచ్ ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)తో రాత్రి 7.30గంటలకి తలపడబోతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మరి మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బంగ్లాలోని వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించాయి.
గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలు ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తును చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేవారు. అలాగే, మృతుల కుటుంబాలందరికీ సత్వర న్యాయం అందించాలని రాహుల్ గాంధీ కోరారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పర్సనల్ లైఫ్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కావ్య మారన్ ఇప్పటికే చాలా మందితో డేటింగ్ చేసిందంటూ అనే రూమర్స్ వస్తున్నాయి. రిసెంట్ గా 23 ఏళ్ల రైజర్స్ ప్లేయర్స్ తో కావ్య మారన్ ప్రేమలో పడిందనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఐపీఎల్ ఫైనల్ చెన్నైలో జరుగుతున్నప్పటికీ హంగామా అంత హైదరాబాద్ నగరంలోనే కనిపిస్తుంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్ స్క్రీనింగ్ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్‌కు రెడీ అవుతున్నాయి.
ఐపీఎల్-2024 ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ చెపాక్ స్టేడియం వేదికగా ఈ టైటిల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీతుమీ తెల్చుకోబోతునున్నాయి.
ఢిల్లీలోని వివేక్ విహార్‌లోని రెండంతస్తుల బేబీ డే కేర్ సెంటర్లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ కేంద్రంలో 11 మంది నవజాత శిశువులు జాయిన్ అయ్యారు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడి మరణించారు.
లోక్‌సభ ఎన్నికల్లో చివరి దశ ఏడో విడత ఎన్నికల కోసం బీజేపీ పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మిర్జాపూర్, మౌ, డియోరియాలలో నిర్వహించే బహిరంగ సమావేశాల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేయనున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఆగ్రా- ముంబై జాతీయ రహదారిపై షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ బైక్ పై వెళ్తున్న ముగ్గురు దొంగలు కదులుతున్న ట్రక్కు నుంచి చోరీ చేశారు.