BJP-NDA alliance: భారతదేశంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమినే అధికారంలోకి వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జరిగిన ఆరు దశల ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపారని చెప్పుకొచ్చారు. భారత్ లో బీజేపీ-ఎన్డీయే తుఫాన్ వీస్తోందన్నారు. ఇండియా కూటమి కులతత్వం, మతతత్వంతో కూరుకు పోయిందని విమర్శలు గుప్పించారు. భారత కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు అవుతారని ఎద్దేవా చేశారు. అలాంటి వారు దేశాన్ని బలోపేతం చేయగలరా అంటూ నరేంద్ర మోడీ ప్రశ్నించారు.
Read Also: America : కూతురికి పాల సీసాలో కూల్ డ్రింక్ ఇచ్చి హత్య చేసిన తల్లి
ఇక, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్‌లు ఓటు బ్యాంకుకే పరిమితం అయ్యారని ప్రధాని మోడీ ఆరోపించారు. కానీ, మోడీ మాత్రం దేశంలోని పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. బీజేపీ అనుసరించిన విధానాల వల్లే దేశంలో మూడో సారి కూడా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు రాజకీయాలకు అర్థం చేసుకున్నారు.. ఎవరి వైపు మొగ్గు చూపాలో వారికి తెలుసని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని మార్చబోతున్నామని సమాజ్ వాది పార్టీ చెబుతుంది.. దీని కన్నా దారుణమైన అబద్ధం మరకొటి లేదని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెచ్చిన రిజర్వేషన్లను తొలగించేందుకు మేము సిద్ధంగా లేమని ప్రధాని మోడీ వెల్లడించారు.