నేడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అశోక్నగర్ తో పాటు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్పూర్లో జాదవ్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్స్ పై వాదనలు వినిపించిన న్యాయవాది సలీం.. సతీష్ కుమార్ నిరపరాది, అమాయకుడు అని పోలీసులే ఈ కేసులో అక్రమంగా ఇరికించారన్న న్యాయవాది సలీం వాదించారు.
విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి, జనసేన నేత కొణతాల రామకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం రాబోతుంది.. పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీనీ కలపడంతో జనసేన సఫలీ కృతమైంది.
కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఉద్రిక్తత కొనసాగుతుంది. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి దగ్గర భద్రతను పెంచారు. రాత్రి హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్ల మండలం నిడిజువ్వికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పోలీసులు గన్ మెన్ సౌకర్యం కూడా పెంచారు.
అనంతపురం జిల్లాలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పోలింగ్ రోజు, తరువాత తలెత్తిన హింసాత్మక ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా దాడుల్లో పాల్గొన్న 159 మందిపై జిల్లా పోలీసులు రౌడీషీట్ ఓపెన చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ అధికారులు అధికారులను అలర్ట్ చేశారు. కర్నూలు, నంద్యాల, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో ముందస్తు బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు. హత్యాయత్నం కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. ఉన్నత న్యాయస్థానంలో హౌస్ మోహషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన ప్రదేశంలోనే నలుగురు దుర్మరణం చెందారు. మరో వ్యక్తి తీవ్రగాయాలు అయ్యాయి.