Devaragattu Bunny Festival: కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లోని కొండపై కొలవైన ఉన్న శ్రీ మాల మల్లేశ్వర స్వామి క్షేత్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. దసరా తరువాత రోజు స్వామివారి కల్యాణం జరుగుతుంది. ఆ సందర్భంగా ఉరేగింపు ఘట్టంలో కర్రల సమరం ఆనవాయితీగా వస్తుంది. గత కొన్ని ఏళ్లుగా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి గొడవల వల్ల కర్రల సమరంగా ఆ పేరు వచ్చింది. ఇది సమరం కాదు.. సంప్రదాయం అని అక్కడి భక్తులు అంటున్నారు. అయితే, ఇప్పుడు ఈ దేవరగట్టు బన్నీ ఉత్సవానికి అరుదైన గౌరవం దక్కింది..
Read Also: Hajj Yatra 2024: నేడు ఏపీ నుంచి హజ్ యాత్ర స్టార్ట్.. తొలి రోజు 322 మంది
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్ లో పాఠ్యంశంగా దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని ఎంపిక చేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో టెన్త్ కొత్త పుస్తకాల్లో బన్నీ ఉత్సవానికి చోటు దక్కింది. ప్రతియేటా దసరా రోజు హోలగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో కర్రల సమరం గురించి ఈ పాఠ్యాంశంలో పొందుపర్చబోతున్నారు. ఈ బన్నీ ఉత్సవం యొక్క ప్రత్యేకత, సంప్రదాయాలను అందులో పొందుపర్చే అవకాశం ఉంది. ఈ ఉత్సవం గురించి ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసేలా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.