భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు బీజేపీ రిజర్వేషన్లను తొలగించడానికి ప్రయత్నిస్తుండటంతో పాటు రాజ్యాంగ ప్రవేశికను తాము మార్చాలని చూస్తున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ 1976లో భారత రాజ్యాంగ పీఠికలో మార్పులు చేశారు.. కానీ ఇప్పుడు అనవసరంగా భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
Read Also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
అయితే, అవసరమైనప్పుడు రాజ్యాంగానికి అవసరమైన సవరణలు చేసే అవకాశం ఉందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు దీన్ని ఇలా చాలా సార్లు చేశాయి.. కానీ పీఠికలో మార్పులు చేసే ప్రశ్న లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం మార్పులు చేసి ఇప్పుడు మాపై నిందలు వేసేందుకు ట్రై చేస్తుంది.. బీజేపీ దాని గురించి ఆలోచించడం లేదని కేంద్రమంత్రి అన్నారు. బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని చింపి పారేస్తుందని, పీఠిక నుంచి “లౌకికవాదం” అనే పదాన్ని తొలగిందని హస్తం పార్టీ నేతలు చేస్తున్న వ్యా్ఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
Read Also: T20 World Cup 2024: తొలి బ్యాచ్తో యూఎస్కు వెళ్లని విరాట్, హార్దిక్.. కారణం ఏంటంటే..?
ఇక, కుల ఆధారిత రిజర్వేషన్లను తొలగించే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. కేవలం మతం ఆధారంగా రిజర్వేషన్లు ఎప్పటికీ ఇవ్వబోమన్నారు. రిజర్వేషన్‌ను ఎందుకు అంతం చేస్తాం.. ఈ దేశంలో ఓబీసీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కావాలి.. కానీ ప్రతిపక్షాలు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.