Remal Cyclone Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ అధికారులు అధికారులను అలర్ట్ చేశారు. కర్నూలు, నంద్యాల, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు. ఇక, మరోవైపు ఈ తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లా యూ. కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంపై స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో సముద్రంలో రాకాసి అలలు ఎగసి పడుతుండటంతో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి.
Read Also: Aravind Kejriwal : బెయిల్‌ను మరో వారం పొడిగించాలని సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్
ఇక, ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే రక్షణ గోడపై నుంచి రోడ్డుపైకి కెరటాలు దూసుకొకొస్తుండడంతో ప్రయాణికులు రాకపోకలు కొనసాగించటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ముందు జాగ్రత్తగా చర్యలో భాగంగా రహదారిని మూసేశారు. ఉప్పాడ, కొనపాపపేట, మాయపట్నం తదితర గ్రామాలపై సముద్రపు అలలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కాగా, తీరం వెంబడి ఉన్న గృహాలు కోతకు గురైతున్నాయి. తుఫాన్ ప్రభావం వల్ల మరో రెండు రోజుల పాటు పలుచోట్ల చెదురు ముదురు వర్షాలు, ఒకటి రెండు చోట్ల మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొనింది.