రోజు రోజుకు పెరిగిపోతున్న కాంక్రీటీకరణ, గాలిలో తేమ స్థాయులు దేశంలోని మహానగరాల్లో వేడిని పెంచేస్తున్నాయి. గత దశాబ్ద క్రితంనాటితో పోలిస్తే ఇప్పుడు రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయన ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ (సీఎస్ఈ) నివేదికలో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సమస్యాత్మకంగా మారిన పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా చెప్పారు.
ఒక యువకుడి వృషణాల్లో అత్యంత అరుదైన, పెద్ద డంబెల్ ఆకారంలోని కణితిని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు విజయవంతంగా తొలగించారు.
రష్యాపై దాడి చేసేందుకు తమ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇవ్వవద్దని.. ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాశ్చాత్య దేశాలను హెచ్చరించారు. ఐరోపాలోని నాటో సభ్యులు ఉక్రెయిన్‌కు పాశ్చాత్య ఆయుధాలను ప్రయోగించమని ఆఫర్ చేయడం ద్వారా నిప్పుతో ఆడుకుంటున్నారు అని మండిపడ్డారు.
తిరుమలలో భక్తల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత గురు, శుక్ర, శని, ఆదివారాల్లో కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయి.. నాలుగు రోజుల పాటు భక్తులు రోడ్లపై రెండు కిలో మీటర్ల మేర నిలబడ్డారు.
ఒడిశాలో నాలుగు దశల ఎన్నికలలో మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక, ఈ దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఒడిశాకు వెళ్తున్నారు.
డేరా సచ్చా సౌదా అధినేత గుర్మింత్ రామ్ రహీమ్ సింగ్ కు పంజాబ్-హర్యానా హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింద. రంజిత్ సింగ్ హత్య కేసులో అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది.
2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశకు ఇంకా ఓటింగ్ జరగాల్సి ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో ఎన్డీయే కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత పోరు కొనసాగుతుంది.