High Tension At Kadapa: కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఉద్రిక్తత కొనసాగుతుంది. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి దగ్గర భద్రతను పెంచారు. రాత్రి హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్ల మండలం నిడిజువ్వికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పోలీసులు గన్ మెన్ సౌకర్యం కూడా పెంచారు. దాదాపు 20 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఇక, మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థి దేవగుడి భూపేష్ రెడ్డి గ్రామంలో లేకపోయినా వారి ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది.
Read Also: Fire Accident : ఉత్తరప్రదేశ్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో భారీగా మంటలు.. తొక్కిసలాట
కాగా, జమ్మలమడుగులో పోలింగ్ రోజు అల్లర్లకు పాల్పడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసేందుకు తగిన చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ఘర్షణలకు పాల్పడిన 46 మందిపై కేసులు నమోదు చేశారు. జమ్మలమడుగులో పోలింగ్ రోజు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై దాడి ఘటన కేసులో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థి దేవగుడి భూపేష్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు అయింది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కారుపై దాడి చేసిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Bharateeyudu Re-Release: భారతీయుడు రీ-రిలీజ్.. నేడు ట్రైలర్ విడుదల!
ఇక, ఎన్నికల సందర్భంగా బైండోవర్ కేసులలో పూచీకత్తు ఇచ్చి.. ఘర్షణకు పాల్పడిన వారి కూచీకత్తులను రికవరీ చేయడానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జమ్మలమడుగులోని వైసీపీ, టీడీపీ, బీజేపీ కార్యాలయాల దగ్గర పోలీసుల పికెటింగ్ సైతం కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి జమ్మలమడుగులో అదనపు పోలీస్ బలగాలు మోహరించాయి. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. ఎన్నికలలో ఘర్షణలకు పాల్పడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చారు.. ఎన్నికలలో ఘర్షణకు పాల్పడిన కేసులలో ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.